ప్రజాశక్తి -అల్లూరి జిల్లా : చీడికాడ,జి కొత్తపల్లి అడివిల ఆగ్రహరం చినగోగాడ బైలుపూడి పంచాయతీల పరిదిలో సోలార్ ప్లాంట్లు నిర్మాణం పేరుతో చేపడుతున్న బలవంతపు భూసేకరణ తక్షణమే నిలుపుదల చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ అప్పలరాజు వ్వవసాయ కార్మికసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న, గోర్రెల మేకలు పెంపకం దార్లు సహకార సంఘం జిల్లా చైర్మైన్ గంటా శ్రీరాం, సిఐటియు మండల కార్యదర్శి రొంగలి దేముడు నాయుడులు డిమాండ్ చేశారు. గురువారం సోలార్ ప్లాంట్లుకు ప్రభుత్వం చేపడుతున్న భూ భాదిత రైతులు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సోలార్ పవర్ ప్లాంట్ పేరుతో, నాలుగు పంచాయతీల పేరుతో 262 ఎకారాల భూమిని రైతులు నుండి ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తుందని, దీన్ని రైతులు ఏకగ్రీవంగా వ్యతిరేకించారని అన్నారు. అయిప్పనటికి రెవెన్యూ తహశీల్దార్ బలవంతంగా నోటీసులు ఇవ్వడం అత్యంత దారుణమని అన్నారు. పట్టాలు లేవని, ఒకవేళ పట్టాలు ఉన్నా ప్రభుత్వ భూములని, రైతులకు హక్కులు లేవని పోలీసులతో బలవంతంగా ఖాళీ చేయిస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. జి. కొత్తపల్లి సర్వే నెంబరు,167 లో 40 ఎకరాలు అడవుల అగ్రహారం లో 55 ఎకరాలు, బైలపూడి లో 60 ఎకరాలు, చిన్న గోవాడ లో పూర్వకాలం నుండి రైతులు సాగు చేసుకుటున్నారని, వీటికి 40 సంవత్సరాలు క్రితమే ప్రభుత్వ, అదికారులు సాగదార్లుకు హక్క పత్రాలు మంజూరు చేసారని అన్నారు. ఇటీవల ఈ భూముల్లో కేంద్ర ప్రభుత్వం ఏపీ ఈపీడీసీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 57.97 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ని నిర్మించనున్నట్లు ప్రకటించిందని , దీంతో భూసేకరణను చేపడుతుందని అన్నారు. ఈభూముల్లో ఉన్న వందలాది రైతు కుటుంబాలు జీడి మామిడి, పామాయిల్, నువ్వులు, వేరుశనగ వంటి పంటలు పండించుకుంటు దాని పై వచ్చిన ఆదాయంతో ఉపాధి పొందుతున్నారని అన్నారు. ఇటువంటి విలువైన భూములను ప్రభుత్వ, అదికారులు రైతులను బెదిరించి బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ప్రవేటికరణలో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేశారని తెలిపారు. దీనిలో భాగంగానే చీడికాడ మండలంలో నాలుగు గ్రామాల్ని గుర్తించి సేకరణకు పూనుకుందని అన్నారు. ఈ బలవంతపు భూసేకరణను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాజిమొగ్గల రమేష్, గంటా మాచిరాజు, మాజీ ఎంపీపీ కొల్లి అప్పలనాయుడు, సిహెచ్ శ్రీను, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
సోలార్ పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలి
07 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 07, 2026, 03:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)