పెదబయలు (అల్లూరు) : అల్లూరి జిల్లాలో సోమవారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలో ఈరోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటలపాటు వడగండ్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి ముందు వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని వాతావరణం చల్లబడింది. కారుమబ్బులు కుమ్ముకున్న అనంతరం ఉరుముల మెరుపుల వడగండ్ల వాన ఒకేసారి రావడంతో వారపు సంతకు వచ్చిన వ్యాపారాలు వినియోగదారులు తలదాచుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. వారపు సంత బురదమయంగా తయారైంది. చిరు వ్యాపారులకు నిలువనీడ లేకుండా పోయింది. మళ్లిళ్లు తెచ్చిన కూరగాయలు ఎక్కడికక్కడే వదిలేసి ఉరుకులు పరుగులు తీశారు. మెరుపు ఉరుముల శబ్దానికి సంతకు వచ్చిన ప్రజలు బెంబేలెత్తిపోయారు. వర్షం ధాటికి పాత ఎంపీడీఓ క్వార్టర్స్ ఎంపీపీ నివాస సమీపంలోని ఓ చెట్టు కూలిపోయింది. ఆ చెట్టు కూలిపోవడంతో ఆ చెట్టు కింద చిరు వ్యాపారం చేసే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
అల్లూరిలో వడగండ్ల వాన
04 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 04, 2026, 03:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)