test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

4 రోజుల క్రితం

marital-suicide-due-to-family-strife
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 10, 2026, 03:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -పెదబయలు : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మ హత్యకు  పాల్పడింది. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పెదబయలు మండలం లక్ష్మీపేట పంచాయతీ కీ చెందిన మట్టం అరుణకుమారి(27)  ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మట్టం వాసుదేవరావు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ వెంకటేష్ పేర్కొన్నారు. మృతదేహానికి ముంచింగి పుట్టు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పోస్ట్ మార్టం నిర్వహించామని, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని అన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో సి ఐ లక్ష్మణ రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్