test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమోసం చేసిన స్నేహితుడు

24 మే, 2026

friends
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 24, 2026, 10:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గుండాలపేట అనే గ్రామంలో కుష్మంత్, రాఘవ అనే మంచి స్నేహితులు ఉన్నారు. కుష్మంత్ కి రాఘవ మీద చాలా నమ్మకం. ఎప్పుడూ కుష్మంత్ తన వ్యక్తిగత విషయాలను రాఘవకి చెప్పేవాడు. కానీ రాఘవ, కుష్మంత్ రహస్యాలను ఇతర స్నేహితులకి చెప్పేవాడు. ఒకరోజు వాళ్ళ స్నేహితులు అందరూ తన గురించి చాలా రకాలుగా మాట్లాడతారు. ఆ మాటలు విన్న కుష్మంత్ ‘మీ అందరికీ నా గురించి ఎలా తెలుసు?` అని కరుణ్‌ అనే స్నేహితుడిని అడిగాడు. ‘మా అందరికి రాఘవ చెప్పాడు’ అని అన్నాడు కరుణ్. ఈ మాట వినగానే కుష్మంత్ కి ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. తర్వాత ఏడుస్తూ ‘నేను రాఘవని నమ్మాను. కానీ నన్ను మోసం చేసాడు’ అని మనస్సులోనే బాధపడ్డాడు. అప్పటి నుంచి కుష్మంత్‌ ‌మౌనంగా ఉండిపోయాడు. రాఘవతో చనువు తగ్గించాడు. కానీ రాఘవ మాత్రం కుష్మంత్ తో చొరవగా ఉండి..‘ఎందుకు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడటం లేదు కుష్మంత్‌’ అని అడిగాడు. కానీ కుష్మంత్‌ ‘ఏమీ లేదు..’ అని సమాధానం ఇచ్చాడు. తర్వాత రాఘవ తన రహస్యాలు కుష్మంత్ కి చెప్పాడు. కానీ కుష్మంత్‌ ఎవరికీ చెప్పలేదు. అది గ్రహించిన రాఘవ తన తప్పు తెలుసుకున్నాడు. కుష్మంత్‌… రాఘవ దగ్గరకు వెళ్ళి ‘నీ తప్పు నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక్కడివి అక్కడ, అక్కడవి ఇక్కడ చెప్పడం మంచిది కాదు. స్నేహితులు అన్న తర్వాత మనసు విప్పి మాట్లాడుకుంటాం. అవి ఇతరులకు చెప్పకూడదు’ అని తన అసంతృప్తి తెలియజేసాడు. తన తప్పు గ్రహించిన రాఘవ క్షమాపణ అడిగాడు.

బుగత జ్యోతి 10వ తరగతి,_
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రఘమండ,
_విజయనగరం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్