ముంబయి : ముడిచమురు ధరలు మళ్లీ పెరిగిన వేళ …. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు పడి 77,845 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 4 పాయింట్లు కోల్పోయి 24,327 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 66 పాయింట్లు పెరిగి 56,047 వద్దకు చేరింది. గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 341 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 441 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం. గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.63 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.38శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.13 శాతం డౌన్ అయ్యింది. “ టెక్నికల్‌గా చూసుకుంటే నిఫ్టీ50కి 24,100- 24,150 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. 24,500- 24,550 వద్ద కీల రెసిస్టెన్స్ ఉంది. రెండింటిలో ఏది బ్రేకౌట్ అయితే అటువైపు నిఫ్టీ50 డైరక్షన్ తీసుకోవచ్చు,” అని చాయిస్ బ్రోకింగ్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు.
అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1.36 శాతం పెరిగి బ్యారెల్‌కి 101.42 డాలర్లకు చేరింది. ఐఈఎక్స్- బై రూ. 132, స్టాప్ లాస్ రూ. 130, టార్గెట్ రూ. 138, కేఈసీ ఇంటర్నేషనల్- బై రూ. 600, స్టాప్ లాస్ రూ. 590, టార్గెట్ రూ. 625, సులా వైన్యార్డ్స్- బై రూ. 175, స్టాప్ లాస్ రూ. 170, టార్గెట్ రూ. 185, ఆర్బీఎల్ బ్యాంక్- బై రూ. 345.7, స్టాప్ లాస్ రూ. 330, టార్గెట్ రూ. 375, హీరో మోటోకార్ప్- బై రూ. 5343, స్టాప్ లాస్ రూ. 5130, టార్గెట్ రూ. 5750, హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్- బై రూ. 4782, స్టాప్ లాస్ రూ. 4600, టార్గెట్ రూ .5125, క్రాంప్టన్ గ్రీవ్స్- బై రూ. 290.7, స్టాప్ లాస్ రూ. 280, టార్గెట్ రూ. 310, డెల్హివరీ- బై రూ. 481.7, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 520.









కామెంట్లు (0)