test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంకెలేగా వేసేద్దాం..!

05 జూన్, 2026

gdp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 06, 2026, 12:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 2025-26లో 7.7 శాతం వృద్ధి
- అనిశ్చితిలోనూ అమాంతం పెరుగుదల..!
బిజినెస్ డెస్క్ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26లో) భారత జిడిపి 7.7 శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర గణాంకాల శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. 2024-25లో 7. 1శాతంగా ఉన్న జిడిపి తగ్గుతుందని అనేక సంస్థలు అంచనా వేశాయి. దేశంలో అధిక ధరలు, పెరిగిన నిరుద్యోగం, హరించుకుపోతున్న ఆదాయాలకు తోడు అమెరికా అధిక టారిఫ్‌‌లు, పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం, ఎగుమతుల పతనం తదితర ప్రతికూల పరిణామాల్లోనూ జిడిపి పెరగడంతో పలు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న అంతర్జా తీయ, దేశీయ ముప్పుల కారణంగా జిడిపి ఒత్తిడికి గురి కావొచ్చని ఆర్‌‌బిఐ సహా అనేక సంస్థలు, ఆర్థిక వేత్తలు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయినా భారత వృద్ధి రేటును మోడీ సర్కార్‌ ‌పెంచి చూపించడంతో అంకెలేగా.. వేసేయ్‌.. అన్న ధోరణిలో వ్యవహరిం చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2022-23ను బేస్‌ ఇయర్‌‌గా పేర్కొంగా ఎన్‌ఎస్‌ఒ ఈ గణాంకాలను ప్రకటించింది. వీటి ప్రకారం 2026 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలోనూ 7.8 శాతం వృద్ధి నమోదయ్యింది. గతేడాది మార్చి త్రైమాసికంలో ఉన్న రూ. 81.40 లక్షల కోట్ల జిడిపి.. క్రితం క్యూ4లో రూ. 87.77 లక్షల కోట్లకు పెరిగింది. గత మార్చిలో దేశంలోకి వచ్చిన విదేశీ నిధుల కంటే దేశం వెలుపలికి తరలిపోయిన నిధుల మొత్తమే ఏకంగా 11.7 బిలియన్ల (దాదాపు రూ. 97,000 కోట్లు) మేర ఎక్కువగా ఉంది. మరోవైపు ఎగుమతుల్లోనూ స్తబ్దత చోటు చేసుకుంది. మార్చి నెలలో ఎగుమతులు ఏకంగా 57.9 శాతం మేర పడిపోయాయి.

వాస్తవం ఇలా...
​అమెరికా అధిక టారిఫ్‌‌లు, పశ్చిమాసియ పరిణామాలతో 2025-26లో భారత ఎగుమతులు కేవలం 1 శాతం పెరిగి 441.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. యుఎస్‌-ఇరాన్‌ ‌ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి గ్యాస్‌ ‌సరఫరా, ముడి సరుకుల కొరతతో దేశీయంగా అనేక పరిశ్రమలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దేశంలో కొత్త పెట్టుబడులు నిలిచిపోయాయి. ఉద్యోగాల కల్పన అత్యంత పేలవంగా ఉంది. జిడిపిలో అధిక వాటా కలిగిన సర్వీసు సెక్టార్‌‌లోని ఐటి రంగంలో పెట్టుబడులు పడిపోవడంతో పాటుగా ఈ రంగంలో ఉన్న ఉద్యోగాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. ఇంకా కొత్త ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. నిరుద్యోగ వృద్ధి వేగంగా పెరుగుతోంది. మరోవైపు అధిక ధరలతో ప్రజల ఆదాయాలు అమాంతం పడిపోతున్నాయి. దేశీయ ప్రయివేటు రంగానికి చెందిన పెద్ద కంపెనీలు కొత్త ఫ్యాక్టరీలు లేదా ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నాయి. దేశీయంగా వినియోగ డిమాండ్ పూర్తి స్థాయిలో పుంజుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. అమ్మకాలు లేక ఖర్చులు తగ్గించుకోవడానికి ఇటీవల దిగ్గజ ఎఫ్‌ఎంసిజి కంపెనీ హెచ్‌‌యుఎల్‌ తమ ఉద్యోగుల్లో 8 శాతం మందిని ఇంటికి పంపించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అమాంతం పడిపోయాయి. ​

వివిధ సంస్థల అంచనాలు ఇలా...

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 7.2 శాతం లోపు వృద్ధి ఉండొచ్చని ఆర్‌‌బిఐ తొలత అంచనా వేసింది. ఎన్‌ఎస్‌ఒ 7.1 శాతంగా, ప్రపంచ బ్యాంక్‌ 6.6 శాతం, ఐఎంఎఫ్‌ 6.5 శాతం, ఎడివి 6.6 శాతం, ఎస్‌అండ్‌‌పి 6.5 శాతంగా ఉండొచ్చని అయా సంస్థలు అంచనా వేశాయి. రాయిటర్స్‌ ‌పోల్‌‌లో ఆర్థిక నిపుణులు కూడా 7.2 శాతం మేర ఉండొచ్చని భావించారు. ఈ అంచనాలు మించి అమాంతం జిడిపి పెరగడం అనుమానాలకు తావిస్తోంది. ‘తయారీ, సేవా రంగాల బలమైన ప్రదర్శనతో అంచనాలను మించి ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత జిడిపి 7.7 శాతంగా, మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలోనూ 7.8 శాతంగా వృద్ధి చెందింది. ‘భారత ఆర్థిక పటిష్టత కోసం మరిన్ని సంస్కరణలు చేపడతాం’ అని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్