test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సెన్సెక్స్‌ 142 పాయింట్ల పతనం

27 మే, 2026

sensex-fell-by-142-points
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 27, 2026, 11:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ఇరాన్‌- అమెరికా మధ్య నెలకొన్న తాజా ఘర్షణల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం సూచీల పతనానికి కారణమైంది. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌ 141 పాయింట్లు నష్టపోయి 75,868కు పరిమితం కాగా.. నిఫ్టీ 6.55 పాయింట్ల నష్టంతో 23,907 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 75,748.21 – 76,224.68 మధ్య తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంది.
సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్‌, రిలయన్స్‌ వంటి బ్లూచిప్ షేర్లు అధిక నష్టాలు చవిచూడగా.. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్‌‌టిపిసి, టాటా స్టీల్‌, ఇండిగో షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్‌ మార్కెట్లో కొత్త రికార్డు సృష్టించింది. ప్రముఖ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌ను వెనక్కి నెట్టి.. భారత్‌లోనే 11వ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. గడిచిన 5 నెలల్లోనే అదానీ పవర్ మార్కెట్ విలువ 68 శాతం పెరిగి రూ.4.85 లక్షల కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.4.72 లక్షల కోట్లకు పరిమితమైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్