బిజినెస్ : విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కోర్సులను అందించే తన రూ.100 కోట్ల ఆన్‌లైన్ వ్యాపారాన్ని మూసివేయనున్నట్లు కంటెంట్ క్రియేటర్, వ్యాపారవేత్త అంకుర్ వారికూ ప్రకటించారు. 2020లో ప్రారంభించిన ఈ బిజినెస్ తాను ఊహించిన దానికంటే.. ఎంతో వృద్ధి చెందిందన్నారు. అయినప్పటికీ దీనిని ఇంకా కొనసాగించడంలో అర్థం లేదంటూ.. ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. ‘నేను నా రూ.100 కోట్ల ఆన్‌లైన్ కోర్సుల బిజినెస్‌ను మూసివేస్తున్నా. 2020లో ప్రారంభమైనప్పటి నుంచి నేను ఊహించిన దానికంటే ఇది ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పటివరకు 5 లక్షల మంది విద్యార్థులు కోర్సులు నేర్చుకున్నారు. రూ.100 కోట్ల అమ్మకాలు సాగాయి. రూ.25 కోట్లు లాభాలు వచ్చాయి. అయినా.. దీనిని ఇంకా ఇలాగే కొనసాగించడంలో అర్థం లేదు’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అంకుర్ ప్రకటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంకుర్ నిర్ణయం వెనుక కృత్రిమ మేధ (AI) కారణమా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, అయ్యుండొచ్చని వ్యాపారవేత్త సమాధానమిచ్చారు. కాగా.. అంకుర్ మరో కొత్త వ్యాపారాన్ని ఏమైనా ప్రారంభించనున్నారా ? అనే సందేహాలను కూడా నెటిజన్లు వ్యక్తం చేశారు.
రూ.100 కోట్ల ఆన్‌లైన్ బిజినెస్ ను మూసేస్తున్నా : వ్యాపారవేత్త అంకుర్ వారికూ
16 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 16, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)