- టియాగో ఇవి ఆవిష్కరణ
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త ఫీచర్లు, ఆధునిక డిజైన్‌తో తదుపరి తరం టియాగో (పెట్రోల్, సీఎన్‌జీ), టియాగో ఇవి మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద ఎంట్రీ లెవల్ పెట్రోల్ కారు ధరను రూ. 4.69 లక్షలు, సిఎన్‌జి ధరను రూ. 5.79 లక్షలుగా నిర్ణయించింది. ఇవి ప్రారంభ ధరను రూ. 6.99 లక్షలుగా పేర్కొంది. ముఖ్యంగా ఇవి మోడల్‌ను బ్యాటరీ అద్దె విధానం ద్వారా రూ. 4.69 లక్షలు సహా కిలోమీటరుకు రూ. 2.6 చొప్పున చెల్లించి పొందే వెసులుబాటు కల్పించింది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 360 డిగ్రీల కెమెరా, 6 ఎయిర్‌బ్యాగుల వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లతో వస్తోన్నాయని
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ ఎండి, సిఇఒ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. ముఖ్యంగా బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ విధానం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ఖర్చును తగ్గించి, గ్రీన్ మొబిలిటీని సామాన్యులకు సైతం మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు.








కామెంట్‌లు (0)