test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రంపచోడవరంలో డ్రోన్ కెమెరాకు చిక్కిన పెద్దపులి

1 రోజు క్రితం

tiger
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 11:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రంపచోడవరం: పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ పరిధిలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం నెలకోట–పూడిపల్లి టన్నెల్ సమీపంలోని కొండ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు డ్రోన్ కెమెరాల ద్వారా నిర్ధారించారు. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై అత్యవసర ఆదేశాలు జారీ చేయడంతో.. అటవీ శాఖకు చెందిన ప్రత్యేక ‘హనుమాన్’ బృందాలు క్షేత్రస్థాయిలోకి దిగి రాత్రంతా అప్రమత్తంగా నిఘా కొనసాగించాయి. ఈ ఆపరేషన్‌ను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు పి.వి. చలపతిరావు, ఎన్. నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం సీసీఎఫ్ డా. జ్యోతి స్వయంగా నిరంతరం సమీక్షిస్తున్నారు. పులిని సురక్షితంగా దారి మళ్లించేందుకు బెంగళూరు నుంచి వచ్చిన ప్రత్యేక వన్యప్రాణి నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగి సాంకేతిక సలహాలు అందిస్తోంది. రంపచోడవరం డీఎఫ్‌వో రామచంద్రరావు స్వయంగా ఘటనాస్థలంలోనే మకాం వేసి ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.

పులి జనావాసాలు, గ్రామాల వైపు రాకుండా ఉండేందుకు అధికారులు అధునాతన డ్రోన్లు, హై-ఫోకస్ లైట్లు, భారీ శబ్దాలు చేసే పరికరాలను వాడుతున్నారు. అటవీ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాలినడకన కొండ ప్రాంతాలకు చేరుకుని పులి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. మరోవైపు ఏజెన్సీ పరిధిలోని గ్రామాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (మైకుల) ద్వారా అధికారులు మైకుల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్