test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘బెదిరింపులొద్దు.. ప్రశ్నించడం మా హక్కు` : ప్రకాష్ రాజ్

2 రోజుల క్రితం

'No threats... questioning is our right': Prakash Raj
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 06, 2026, 11:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : ‘బెదిరింపులొద్దు.. ప్రశ్నించడం మా హక్కు` అని సినీనటుడు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు ప్రకాష్ రాజ్. తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు పెట్టిన పోస్టుపై ప్రకాష్ రాజ్ స్పందించారు. నాయకుడికి అన్నీ తెలుసని ఆయన మాటే శాసనం అని నాగబాబు పోస్ట్‌ పెట్టారు. నాయకుడి మాటను అనుసరించాలని కోరారు. ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ పవన్‌ కల్యాణ్ ఫొటోను జత చేశారు. ఈ పోస్టుకు ప్రకాష్ రాజ్ బదులిస్తూ …. ‘‘ మీ సందేహాలను పక్కనపెట్టండి. మౌనంగా నాయకుడిని అనుసరించండి అనడంలో మీ ఉద్దేశం ఏంటి ? మేం జంతువులం కాదు మౌనంగా బతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ’’ అని ప్రకాష్ రాజ్ తన పోస్టు లో పేర్కొన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్