ఇంటర్నెట్ : జీవితంలో కొన్ని క్షణాలు విజయాన్ని మాత్రమే కాదు, ప్రేమను కూడా చిరస్మరణీయంగా నిలబెడతాయి. అలాంటి అరుదైన అందమైన సంఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత సైన్యపు ఏవియేషన్ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఓ యువ ఆర్మీ పైలట్ చేసిన సర్‌ప్రైజ్ ప్రపోజల్ అందరి హృదయాలను గెలుచుకుంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (CAATS)లో ఫ్లైట్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న కెప్టెన్ భరత్ భరద్వాజ్, తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజున మరో ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. గ్రాడ్యుయేషన్ వేడుక ముగిసిన వెంటనే తన ప్రియురాలు ఆరుషి ముందు మోకాళ్లపై కూర్చుని ప్రేమను వ్యక్తం చేస్తూ పెళ్లి ప్రతిపాదన చేశారు. ఈ అనూహ్య పరిణామంతో ఆరుషి కాసేపు ఆశ్చర్యానికి గురైనా, వెంటనే ఆనందంతో అతని ప్రతిపాదనను అంగీకరించింది. అక్కడున్న కుటుంబ సభ్యులు, సైన్యాధికారులు, శిక్షకులు, అతిథులు చప్పట్లు కొడుతూ ఈ మధుర క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న భరత్, “ఈ రోజు మేమంతా పైలట్లుగా, శిక్షకులుగా కొత్త బాధ్యతలను స్వీకరించాం. మా కృషికి ఫలితం దక్కిన రోజు ఇది. గత ఐదేళ్లుగా ఆరుషితో పరిచయం ఉంది. ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదని భావించాను. నా కుటుంబానికి, కాబోయే భార్యకు ఈ రోజును మరపురానిదిగా మార్చాలనుకున్నాను” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. “బ్యూటిఫుల్ ప్రపోజల్ బ్రో”, “దేశ సేవతో పాటు ప్రేమను కూడా గౌరవించిన అద్భుతమైన క్షణం”, “సినిమాను తలపించే రియల్ లైఫ్ సీన్” అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రేమ, విజయం ఒకే వేదికపై కలిసిన ఈ అరుదైన క్షణం అందరినీ ఆకట్టుకుంటోంది.
గ్రాడ్యుయేషన్ పరేడ్‌లోనే ప్రేమకు గ్రీన్ సిగ్నల్.. ఆర్మీ పైలట్ సర్‌ప్రైజ్ ప్రపోజల్ వైరల్ !
03 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 01:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)