సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ భూకంపం సంభవించింది. రాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదైంది. చంబా జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చంబా, ధర్మశాల, డల్హౌసీ, భర్మౌర్, కాంగ్రా, కులు మరియు రాజధాని సిమ్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు బలంగా కంపించింది.
ఈ భూకంప ప్రభావం కేవలం హిమాచల్ ప్రదేశ్‌కే పరిమితం కాలేదు. పక్కనే ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పాటు చండీగఢ్ తదితర ఉత్తర భారత ప్రాంతాల్లోనూ స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. చంబా పరిధిలోని హోలీ ప్రాంతంలో కొన్ని ఇళ్లకు స్వల్పంగా దెబ్బతిన్నట్లు (గోడలకు పగుళ్లు) సమాచారం. ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ, భారీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని అధికారులు వెల్లడించారు.








కామెంట్‌లు (0)