test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్ పేపర్ లీక్‌పై  జంతర్ మంతర్ వద్ద ‘సీజేపీ’ఆందోళన..

2 రోజుల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 06, 2026, 11:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్  పేపర్ లీక్ వ్యవహారం, అలాగే సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎమ్ వివాదాలపై విద్యార్థి లోకం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం ఉదయం నుంచే నిరసనకు దిగింది. చలో జంతర్ మంతర్ పిలుపులో భాగంగా కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ భారీ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ఆందోళన కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే, ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ తీరును, వ్యవస్థలోని అవినీతిని ఎండగడుతూ విద్యార్థులంతా ‘కాక్రోచ్’ (బొద్దింక) మాస్కులు ధరించి నిరసన తెలపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నిరసన కార్యక్రమం శనివారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఢిల్లీ చేరిన సీజేపీ వ్యవస్థాపకుడు

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్