నెల్లూరు : నెల్లూరు జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన భక్తుల బస్సు ఆదివారం అర్ధరాత్రి బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీన నెల్లూరు జిల్లాలోని సంగం నుంచి 43 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ బస్సు, గయ నుంచి వారణాసి వెళ్లే క్రమంలో జాతీయ రహదారి (NH-2) పై ఎదురుగా వస్తున్న ఒక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు ఎడమవైపున కూర్చున్న నెల్లూరు జిల్లావాసులు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, అధికారులు క్షతగాత్రులను తక్షణ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాశీ యాత్రలో జరిగిన ఈ ఘోర ప్రమాద వార్త తెలియడంతో నెల్లూరు జిల్లాలోని బాధితుల స్వగ్రామాల్లో తీవ్ర విషాదం, ఆందోళన నెలకొన్నాయి. పరాయి రాష్ట్రంలో ప్రమాదంలో చిక్కుకున్న తమను ఆదుకుని, స్వస్థలాలకు సురక్షితంగా చేర్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు, వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
బీహార్‌లో నెల్లూరు జిల్లా యాత్రికుల బస్సుకు ప్రమాదం.. ముగ్గురు మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 10:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)