test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ సిలబస్‌ అమలు చేయని కార్పొరేట్ విద్యాసంస్థలు

05 జూన్, 2026

vilson
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 06, 2026, 12:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చైతన్య, నారాయణ, భాష్యం వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ సిలబస్‌ అమలు చేయడం లేదని తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ ఆర్‌‌డి విల్సన్ శరత్ చంద్ర తెలిపారు. అకాడమీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థలు అకాడమీ పుస్తకాలు కొనుగోలు చేయడం లేదని, దీనివల్ల అకాడమీకి తీరని నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ సిలబస్ కాకుండా సొంతంగా తయారు చేసుకోవడం సరికాదని తెలిపారు. 2010లో ఉమ్మడి రాష్ట్రంలో అకాడమీ పుస్తకాలు కొనుగోలు చేసేలా జిఓ విడుదల చేశారని, దీనిని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని వెల్లడించారు. అకాడమీ నష్టాల్లోకి పోకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి లోకేష్‌‌ను కోరామని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి కాలేజీని సందర్శిస్తామని చెప్పారు. తెలుగు అకాడమీ కంటెంట్ వాడకుండా పైరసీ చేస్తే కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతుందన్నారు. అకాడమీ ముద్రించే ఇంటర్ పుస్తకాలు పుస్తకాల షాప్‌‌లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తమిళనాడు తరహాలో తెలుగు వర్చువల్ అకాడమీ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధం చేశామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులతోపాటు ఇతర దేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి కూడా భాషను పరిచయం చేస్తామన్నారు. అకాడమీ పోస్టుల భర్తీ విషయంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌‌సి)కు లేఖ రాశామని వెల్లడించారు. ఎపిపిఎస్‌‌సి ఆలస్యం చేస్తే ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు అప్పగించాలని కోరారు. అకాడమీ ఔనత్యం కాపాడాలంటే కేబినెట్ కేడర్ ఇవ్వాలని కోరారు. తిరుపతి కేంద్రంగా సంస్కృత అకాడమీ అభివృద్ధి చేస్తామని, అందుకు గానూ తిరుమలలో ఐదెకరాలు కేటాయించాలని కోరారు. సంస్కృత భాష అభివృద్ధి కోసం టిటిడి నిధులు కేటాయించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్