test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కెజిబివిల్లో 299 పోస్టుల భర్తీ

25 మే, 2026

kgbv
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 26, 2026, 12:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం (కెజిబివి)ల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు సమగ్రశిక్ష నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 352 కెజిబివిల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయను న్నట్లు సమగ్రశిక్ష డైరెక్టర్‌ ‌బి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నామని తెలిపారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన 2026-27 విద్యాసంవత్సరానికి చేపడుతున్నట్లు తెలిపారు. 16 ప్రిన్సిపల్ పోస్టులు, 98 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పిజిటి), 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సిఆర్‌‌టి), 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (పిఇటి) పోస్టులు ఉన్నాయన్నారు. జీతం, వయో పరిమితి, విద్యార్హతలు తదితర వివరాలకు http://kgbvrecruitment. apcfss.in వెబ్‌‌సైట్‌‌ను సందర్శించాలన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్