test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జూన్ 9 న దేశ వ్యాప్త నిరసనను జయప్రదం చేద్దాం : సిపిఎం నేత వి.ఉమామహేశ్వరరావు

06 జూన్, 2026

Let us make the nationwide protest on June 9 a success: CPM leader V. Umamaheswara Rao.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 06, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • దేశ ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించిన మోడీ ప్రభుత్వం

  • విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన పేపర్ లీకేజీలు

  • జూన్ 9 నిరసనలను జయప్రదం చేయాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. ఉమామహేశ్వరరావు పిలుపు

తూర్పు గోదావరి : దేశ ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన పేపర్ లీకేజీలు, ప్రజా రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కులపై దాడులకు వ్యతిరేకంగా …. జూన్ 9న దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం తూర్పుగోదావరి జిల్లాలో సిపిఎం కార్యాలయం నిర్వహించిన కార్యక్రమం జువ్వల రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధి గా పాల్గొన్న వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ …. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిందన్నారు. సంపద కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవన పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుందని, కోట్లాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. సమస్యల పరిష్కారానికిగాను జూన్ 9 న చేపట్టనున్న దేశవ్యాప్త నిరసనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్