test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడేటా సెంటర్లతో పర్యావరణానికి హాని

04 జూన్, 2026

jvv
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 05, 2026, 12:40 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ జాతీయ నాయకులు డి.రఘునందన్

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : అభివృద్ధి చెందిన దేశాలన్నీ పర్యావరణానికి హానికరమైన డేటా సెంటర్లను వ్యతిరేకిస్తుంటే మన దేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రభుత్వాలే ఆహ్వానిస్తుండడం ప్రమాదకరమని ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ జాతీయ నాయకులు డి.రఘునందన్ పేర్కొన్నారు. ‘డేటా సెంటర్లు – విశాఖ పర్యావరణంపై ప్రభావం` అన్న అంశంపై జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యాన నగరంలోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ సెమినార్ హాల్లో గురువారం సదస్సు నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ… అమెరికా, ఐరోపాలో చల్లని వాతావరణం ఉన్న చోట ఎయిర్ కూలింగ్ సాధ్యమవుతుందని, కానీ విశాఖపట్నం వంటి ఉష్ణ మండల, తేమతో కూడిన వాతావరణంలో శీతలీకరణకు భారీగా నీరు అవసరమవుతుందని తెలిపారు. ఒకవేళ డ్రై కూలింగ్ టెక్నాలజీ వాడితే నీరు తక్కువగా అవసరం కావొచ్చు గానీ విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతుందన్నారు. అది మరింత వేడిని విడుదల చేస్తుందని తెలిపారు. విద్యుత్ డిమాండ్ స్థానిక గ్రిడ్‌ను ఒత్తిడికి గురిచేసి స్థానిక నివాసితులు, పరిశ్రమలపై నాక్-ఆన్ ప్రభావాలకు దారితీయవచ్చని చెప్పారు. పర్యావరణాన్ని విస్మరిస్తే స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. అడ్డగోలుగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో విశాఖ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజాభిప్రాయాన్ని పాలకులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పర్యావరణానికి హానికరం కాని ప్రదేశంలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భారతదేశంలో డేటా సెంటర్ల ఏర్పాటు చేయడం ద్వారా స్టోరేజీ స్థాయి పెరుగుతుంది కానీ మన డేటాపై విదేశీ నియంత్రణ ఉంటుందని అన్నారు. దీనివల్ల మన డేటా పారదర్శకత ప్రశ్నార్థకమవుతుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ మాట్లాడుతూ… పర్యావరణానికి హాని కలగకుండా డేటా సెంటర్లు ఏర్పాటు చేయలన్నారు. కార్యక్రమంలో జెవివి రాష్ట్ర కోశాధికారి జి.మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి జి.గిరిధర్, మానవ హక్కుల వేదిక అధ్యక్షులు విఎస్.కృష్ణ, ప్రజారోగ్యవేదిక రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరరావు, జెవివి హెల్త్ సబ్ కమిటీ రాష్ట్ర కో – కన్వీనర్ డాక్టర్ ఎం.రమేష్‌ కుమార్, జిల్లా పర్యావరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ కె.రామత్రినాథరావు, ప్రొఫెసర్ జివి.రమణ, పర్యావరణ వేత్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్