test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజా రవాణాను బలోపేతం చేయండి

14 మే, 2026

ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల అక్రమ కూల్చివేతలు ఆపాలి : సిపిఐ(యం)
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 15, 2026, 01:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

-  సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాలు ఇంధనం పొదుపు చేయాలని చెబుతున్న నేపథ్యంలో, ప్రజల దైనందిన అవసరాలు తీరే విధంగా ప్రజా రవాణాను బలోపేతం చేయాలని ఈ ప్రకటనలో ఆయన కోరారు. రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం అమలుతో ఆర్టీసి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, దానికి తగినట్టుగా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. పట్టణాల్లో సిటీ బస్సుల కొరత మరింత తీవ్రంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల నుండి విద, వైద్య అవసరాల కోసం, ఉపాధికోసం నిత్యం సమీప పట్టణాలకు వెళ్ళే వారు ప్రయివేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం అవసరమన్నారు. అందుకోసం ఆర్‌‌టిసి బస్సులను పెంచడంతోపాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు కూడా ప్రత్యేక వాహనాలను నిర్వహించడమే సరైన ప్రత్యామ్నాయమని సూచించారు. దీనివల్ల ఇంధనం పొదుపు అవుతుందని, ప్రజలపై భారం తగ్గి సౌకర్యం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్యాసింజర్ రైళ్లను తగ్గించిందని, ఎక్స్‌ ‌ప్రెస్‌ ‌రైళ్లలో జనరల్ భోగిలను కూడా కుదించిందని పేర్కొన్నారు. ప్యాసింజర్ రైళ్లను, ఎక్స్‌ ‌ప్రెస్‌ ‌రైళ్లలో జనరల్ బోగీలను పెంచడం ద్వారా ప్రజా రవాణాను బలోపేతం చేయవచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిస్థితులన్నీ సజావుగా ఉన్న సమయంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ వంటివి అమలు చేస్తే ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందవలసిన సేవలకు, ప్రభుత్వాధికారుల జవాబుదారీతనానికి అంతరాయం కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని శ్రీనివాసరావు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్