test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమరావతిపై వైసిపి కమిటీలు హాస్యాస్పదం

04 జూన్, 2026

narayana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 11:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాజధానిలో వేగంగా వాగుల అభివృద్ధి : మంత్రి నారాయణ

ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు జిల్లా) : అమరావతిపై వైసిపి కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉందని మున్సిపల్‌ ‌శాఖ మంత్రి పి నారాయణ విమర్శించారు. రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తామని వైసిపి నాయకులు చెబుతున్నారని, భవనాలు, రోడ్లు, పైపులైన్ల నిర్మాణం పూర్తయ్యాక భూములు ఇవ్వడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. సిఎంగా పని చేసిన వ్యక్తికి ఆ మాత్రం అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల వద్ద వరద నీరు నిలవకుండా ఉండేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం ఆయన పర్యవేక్షించారు. ఎన్ -9, 8, 7 రోడ్లలో కొండవీటి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిల పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిల కింద కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం లేకుండా మట్టి తొలగించాలని, వాగు వెడల్పు తక్కువగా ఉన్నచోట మరింత వెడల్పు చేయాలని అధికారులను ఆదేశించారు. నీరుకొండలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వర్షాకాలం దృష్ట్యా రాజధాని అమరావతిలో వాగుల అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జిలు, వాగుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ట్రంక్ రోడ్లపై 43, ఎల్‌‌పిఎస్‌ (ల్యాండ్ పూలింగ్) జోన్లలో 32 బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని చెప్పారు. శాఖమూరు, పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్లలో సగం పని పూర్తయిందని చెప్పారు. కొండవీటివాగు 23.7 కిలోమీటర్లు, పాలవాగు 16.7 కిలోమీటర్లు, గ్రావిటీ కాలువ 7.84 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తున్నామని, నీరుకొండ రిజర్వాయర్ 440 ఎకరాల్లో నిర్మితమవుతోందని తెలిపారు. రైతులను వైసిపి నాయకులు రెచ్చగొడుతున్నారని, విబేధాలు సృష్టించి రాజధానిని విధ్వంసం చేయాలని ఆ పార్టీ చూస్తోందని మండిపడ్డారు. మంత్రి వెంట అమరావతి అభివృద్ధి సంస్థ (ఎడిసి) చైర్ పర్సన్ డి లక్ష్మీ పార్థసారధి, సిఆర్‌‌డిఎ ఎడిసి చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్