test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడిప్యూటీ సిఎం వ్యాఖ్యలు సరికావు

4 రోజుల క్రితం

cpi-secretary
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 10:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. కమ్యూనిజం చచ్చిపోయింది అని దుందుడుకు వ్యాఖ్యలు చేయటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసింది. రాజకీయాల్లో నిర్దిష్టమైన సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా, కేవలం అధికారమే పరమావధిగా భావించి ఒకవైపు కుల రాజకీయాలను, మరవైపు మతోన్మాద రాజకీయాలను, ఇంకోవైపు సనాతన రాజకీయాలను పెంచి పోషిస్తూ కుర్చీ కోసం వెంపర్లాడే పవన్.. కమ్యూనిజం గురించి అవాకులు చవాకులు పేలడం తగదన్నారు. వందేళ్ళ చరిత్ర కలిగిన కమ్యూనిజం చచ్చిపోయిందనే పవన్ వంటి ఊసరవెల్లి రాజకీయాల్లో ఉండటం తెలుగు ప్రజల దౌర్భాగ్యమన్నారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చేగువేరా వంటి మహనీయులతో తనను పోల్చుకున్న పవన్‌కు కనీసం ఆ మహనీయుల చరిత్ర, పోరాటం, త్యాగాల గురించి తెలుసా? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్, బిజెపి, అమిత్ షా అజెండాలను మోస్తున్న పవన్ చెబితే ఈ దేశం నుండి, ఈ ప్రపంచంలో నుండి తుడిచిపెట్టుకుపోయే దుస్థితిలో కమ్యూనిజం లేదన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన విశ్లేషణ తప్పయితే.. తప్పు అని చెప్పాలి లేదంటే ఖండించాలన్నారు. అలా కాకుండా రెండు ప్రాంతాల మధ్య వైరుధ్యాన్ని పెంచి పోషించేలా పవన్ వ్యాఖ్యలు చేయటం సరైనది కాదన్నారు. కమ్యూనిజం గురించి చేసిన వ్యాఖ్యలను ‌ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్