test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జూలై 11, 12 తేదీల్లో సాహిత్య సమ్మేళనం - 2026

2 గంటల క్రితం

literature
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 06:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

జూలై 11, 12 తేదీల్లో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంబీవీకే, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు "సాహిత్య సమ్మేళనం - 2026" జరుగుతుంది. సమకాలీన సాహిత్యానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రముఖ కవులు, రచయితలు, విమర్శకులు ప్రసంగిస్తారు. సాహిత్య చరిత్ర - వివిధ దృక్పథాలు, ప్రపంచీకరణ - ప్రతిఘటనా సాహిత్యం, కవిత్వ నిర్మాణం - వస్తు, శిల్పాలు, కవిత్వ రచన వివిధ పద్ధతులు, తెలుగు కథ - సామాజిక చింతన, కథారచన - మెళకువలు, కవులు - రచయితలకు అధ్యయనం ఆవశ్యకత వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ అంశాలపై రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, తెలకపల్లి రవి, ఖాదర్ మొహీయుద్దీన్, గుంటూరు లక్ష్మీనరసయ్య, డా. కోయి కోటేశ్వరరావు, అట్టాడ అప్పలనాయుడు, మహమ్మద్ ఖదీర్ బాబు, ఆర్. సీతారాం తదితరులు మాట్లాడతారు.
"సృజనకారుల స్వరం" పేరిట నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో వర్తమాన సాహిత్యం, రచనా అనుభవాలు, సమకాలీన సాహిత్య సవాళ్లు, భవిష్యత్ దిశలపై వర్ధమాన కవులు, రచయితలు తమ అనుభవాలను పంచుకుంటారు. యువ కవులు, యువ రచయితలు తమ రచనా ప్రయాణం, ఆలోచనలు, సాహిత్య ప్రపంచంపై తమ ఆకాంక్షలను పంచుకుంటారు. వివిధ సాహిత్యాంశాలపై ప్రముఖ కవులు, రచయితలతో వర్తమాన రచయితల ప్రశ్నోత్తర కార్యక్రమం కూడా ఉంటుంది. సాహిత్యం, రచన, ప్రచురణ, సమకాలీన సాహిత్య ధోరణులు, రచయితల అనుభవాలకు సంబంధించిన సందేహాలను పాల్గొనేవారు నేరుగా అడిగి నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
యువ కవులు, రచయితలు, ఔత్సాహిక సాహితీ మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం. పాల్గొనేవారు కింది బాధ్యుల్లో ఎవరో ఒకరికి ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. రెండు రోజుల పాటు భోజన, వసతి ఏర్పాట్లు ఉంటాయి. మరిన్ని వివరాల కోసం గుండు నారాయణ (9951540671), కె. స్వరూపరాణి (9490098022), టి. క్రాంతి (9490098042), వొరప్రసాద్ (9490099059), చీకటి దివాకర్ (6300904525), కెంగార మోహన్ (9493375447), గనారా (9949228298), కె. శ్రీనివాస్ (9490098811)లను సంప్రదించవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్