test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం..

2 గంటల క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 08:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల: తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో శ్రీవారి దర్శనార్థం భారీగా యాత్రికులు తిరుమలకు పోటెత్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు యాత్రికులతో పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు దాటి వెలుపల ఉన్న క్యూలైన్లలో సైతం యాత్రికులు సుదీర్ఘంగా వేచి ఉన్నారు. దర్శన టోకెన్లు లేని యాత్రికులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు క్యూలైన్లలో పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే మొత్తం 74,636 మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 4.64 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్