DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం

08 జూన్, 2026

visakha steel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 06:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. స్టీల్ లిక్విడ్ పడి 9మంది కార్మికులు మృతి చెందారు. 1500 డిగ్రీల లిక్విడ్ స్టీల్ తరలిస్తుండగా పేలుడు సంభవించి, లిక్విడ్ మీద పడి 9మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

క్షతగాత్రుల్లో ఆరుగురి గుర్తింపు

  • రావూరి మల్లికార్జున రావు, పల్లెల శ్రీనివాసరావు, అప్పారావు, సత్యానంద్ బొల్లా, హరిబాబు, రాజుగా గుర్తింపు 

  • వివరాలు ప్రకటించిన అధికారులు 



Live Updates
3 months agoJun 08, 2026 07:21 PM IST

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.


3 months agoJun 08, 2026 07:18 PM IST
  • ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

3 months agoJun 08, 2026 07:16 PM IST
  • విశాఖ ఉక్కు ప్రమాదంపై సిపిఎం దిగ్భ్రాంతి

విశాఖ ఉక్కు ప్రమాదంపై సిపిఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది .  ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు .  కార్మికుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు .  ప్రమాద కారణాలపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు .  చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు .  ప్రమాద బాధితులకు 50 లక్షలు చెల్లించాలని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్