test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Tech Layoffs: అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు.. ఆ టెక్ టీమ్‌పై వేటు.. ఎంత మందిని తీసేస్తున్నారంటే..

05 మార్చి, 2026

Amazon layoff
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మార్చి 05, 2026, 04:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

Tech Layoffs: దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. గత జనవరి నెలలోనే 16 వేల మందిని తొలగించిన ఈ కంపెనీ రెండు నెలలు గడవక ముందే మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఈసారి రోబోటిక్ టీమ్‌ను తొలగిస్తున్నట్లు సమాచారం. మరి లేటెస్ట్ లేఆఫ్స్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.


Tech Layoffs: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. ఈసారి రోబోటిక్స్ టీమ్‌లోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. దాదాపు 100 మంది వరకు వైట్ కాలర్ టెక్ ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ఈ ఏడాది 2026, జనవరిలో 16 వేల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించిన సంగతి తెలిసిందే. మరిన్ని తొలగింపులు ఉంటాయని అప్పుడే అమెజాన్ సంకేతాలు ఇచ్చింది. కానీ, రెండు నెలలు గడవక ముందే మరోసారి లేఆఫ్స్ ప్రకటించడం గమనార్హం. అందులో భాగంగానే ఈ తాజా లేఆఫ్స్ చేపట్టినట్లు తెలుస్తోంది.

తాజా లేఆఫ్స్‌లో భాగంగా అమెజాన్ గోదాముల్లో పనిని ఆటో మేషన్ చేసేందుకు రోబోలను డిజైన్ చేసే టీమ్ పై వేటు వేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తమ టీమ్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటామని అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఎంత మందిని తొలగించింది అనే విషయాలను చెప్పకుండా ఉద్యోగాల కోతను ధ్రువీకరించింది. వేర్ హౌస్ లో కార్మికులకు సాయపడే రోబోటిక్ విభాగమైన బ్లూ జే. గతేడాది 2025 అక్టోబర్ లో రోబోలను ప్రదర్శించింది. అయితే, ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతోనే ఈ సంవతరం జనవరిలో వీటి తయారీని నిలిపివేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్