test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జీవన శిల్పం

1 రోజు క్రితం

విసుగు అనే పదానికి చోటెక్కడ…
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విసుగు అనే పదానికి చోటెక్కడ…
ఇంకా కలలతో కట్టాల్సిన
ఒక భవిష్యత్తు ఉన్నప్పుడు…

అడుగడుగునా చెమటతో చెక్కాల్సిన
ఒక జీవితముంది,
పోరాటాలతో పదును పెట్టాల్సిన
ఒక కాలముంది
ప్రేమను అణువణువునా నింపుకోవాల్సిన
ఒక మనసుంది…

ఓటములను కుంపటిగా పేర్చి
విజయాన్ని వెలిగించాల్సి ఉంది,
జీవన శిల్పాన్ని ప్రగతిపథం వైపు
నడిపించాల్సి వుంది
నిన్నటి నన్ను దాటి
రేపటి నన్ను చేరాల్సి ఉంది…

ఈ శరీరాన్ని శిల్పంలా మలుచుకుంటూ,
ఈ ఆలోచనలను ఆకాశంలా విస్తరించుకుంటూ,
ప్రతిరోజూ కొత్తగా పుడుతున్నప్పుడు
విసుగనే పదానికి చోటెక్కడుంది ?

ఇది…
ప్రతి నిత్యం తీసుకునే సంకల్పం
నన్ను నేను నిర్మించుకునే
మరో అవకాశం…!

రాజాబాబు కంచర్ల
9490099231


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్