నాకు మొదటి నుండి నువ్వు అపురూపమే!
పట్టుకుందామనుకుంటాను జారిపోతావు..
దాచుకుందామనుకుంటాను పారిపోతావు..
సర్లే..రంగూ రూపం లేని నీతో
నాకేం పని అనుకుంటానా..అదేంటో గానీ
ఎక్కడపడితే అక్కడ నీ దర్శనమే..
అమ్మ పాలతో మొదలై
తులసి తీర్థం దాకా తడిచేస్తావు..
ఒకసారి కన్నీటిచుక్కలా
చెక్కిలిపై జారుతావు..
మరోసారి పన్నీటి చుక్కవై
పరవశింప చేస్తావు..
శ్రమించానని సాక్ష్యంగా
స్వేదపు చుక్కవై మెరుస్తావు..
అలసిన మనసుతో కబుర్లాడుతూ
తేనీటి చుక్కవై ధరి చేరుతావు..
అందుకే ఓ నీటి చుక్కా!
నువ్వంటే నాకు అబ్బురం.. అపురూపం..
శ్రీలత బొమ్మన, 8106521019








కామెంట్‌లు (0)