test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేను నేనేనా

24 మే, 2026

kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 24, 2026, 10:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​నన్ను నేను మరిచి ప్రవర్తిస్తున్నా
నేనేంటో తెలుసుకోక
ఏమి చేస్తున్నానన్న జ్ఞానం ఉన్నా
తెలియనట్లు నటిస్తున్నా

ఏమి చేయాలో ఆలోచించకుండా
చేస్తూ పోతున్నా ఎందుకో ?
మనిషిగా అపారమైన జ్ఞానమున్నా
ఆచరణలో వెనకబడుతున్నా

నన్ను నేను ఏమనాలో తెలియక
ఎలా నడవాలో ఆలోచిస్తున్నా
నాలో నన్ను అడుగుతున్నా
ఈ ప్రయాసెందుకని.

ఎవరినైనా అడగాలనుకుంటున్నా
అహంకారం అడ్డమొస్తుంది
నాలో కలిగే ప్రశ్నలకు
సమాధానం నేనేనా?

ఏది నాదో తెలియదు
నేనెవరో తెలియదు
ఏమైతానో తెలియదు
ఎందుకో ఈ అపోహలు

యద్భావం తద్భవతి

జి రామమోహన నాయుడు
9490272366


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్