test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నా వేసవి

1 రోజు క్రితం

మూడు రోడ్ల కూడలి మూలమీద
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 01:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మూడు రోడ్ల కూడలి మూలమీద
రెండు పక్కల అరుగుల మధ్య పెద్ద రోలు
రోకళ్ల దరువుతో దంచబడే ధాన్యం
పొయ్యి మీద కుతకుత ఉడికే గట్క

పోలేరమ్మ గుడి ముందరి
మర్రి ఊడలే ఉయ్యాలలై
ఊపుతుంటే ఆనంద హేలలో వేసవి

రాలిన వేపపండ్లు మానెడైతే
మదిలో పుట్నాలు బెల్లం తారాడుతుంటే
నోట్లో నీళ్లు ఊరించిన వేసవి

తాడెక్కిన రామచంద్రు మామ
గీసిన పొద్దాటి పొద్దటి కల్లు పద్ధతిగా
రేకలో తాగిన వేసవి
దించిన మూడు కళ్ళ ముంజలు
జుర్రుతుంటే ఒంట్లో వేడి గాయబ్
జుర్రిన కాయల లోపల కర్ర గుచ్చి బండ్లు చేసిన వేసవి ఇంకా యాదిలో

వాగెంట ఈదుల్లో ఇరుక్కున్న
ఈతగెలలు తెంపి గడ్డి వాముల్లో

పరాయి కంట పడకుండా మాగబెట్టి
పండాక మా నేల ఖర్జూరం ఈతపండు రుచి ఇంకా పదిలం చేసిన వేసవి

నాపబండ్ల వీధుల్లో చుర్రుమంటున్న కాళ్ళని
లెక్క చేయక ఆడిన దొంగాపోలీసు
అడుగంటిన బావుల్లో
అలుపెరుగక తోడిన నీళ్ళు
మోసిన పలనాటి పంట్లు
నీటి కష్టాల వేసవి కి నిలువెత్తు సాక్ష్యం

– గిరిప్రసాద్ చెలమల్లు
9493388201


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్