test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సముద్రం .. జీవానికీ, జీవనానికీ ఆధారం ..

1 రోజు క్రితం

The ocean... the foundation of life and livelihood.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 11:38 పూర్వాహ్నం | 8 నిమిషాల చదవడం

సముద్రం అంచున కూర్చుని దానిని చూస్తుంటే, కళ్లతో కొలవలేనంత దూరంతోబాటు, మనసుతో కొలవలేనంత అనంతంగా, ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది కదా! ఆ చల్లని సముద్ర గర్భం దాచుకున్న బడబానలమెంతో, ఆ అగాధమైన జలనిధిలో ఆణిముత్యా లెన్నున్నాయో మనకు తెలియదు కానీ, సముద్రం మనకూ, భూమి మీద అన్ని జీవరాసులకూ ఎంతో ముఖ్యమైనది అని మాత్రం తెలుసుకోవలసిన విషయం. జూన్ 8వ తేదీ ప్రపంచం మొత్తం ‘ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం’ (World Oceans Day) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..


మన సౌరకుటుంబంలో నీరు ఉందని నిశ్చయంగా తెలిసిన ఏకైక గ్రహం భూమి. మనం “భూమి” అని పిలుస్తాం గానీ దానిపై ఖండాలు, పర్వతాలు, ఎడారులు కంటే సముద్రాలే ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఈ గ్రహానికి ‘Earth’ కంటే ‘Water’ అనే పేరు బాగా సరిపోతుంది! భూమి ఉపరితలాన్ని 70 శాతం మేర మహాసముద్రాలు ఆవరించి, భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97 శాతం (సుమారు 1.35 బిలియన్ ఘనపు కిలోమీటర్ల) నీటిని నింపుకుని ఉన్నాయి. అయిదు మహాసముద్రాలని మన సౌకర్యార్థం విడగొట్టి, పేర్లుపెట్టుకున్నా, సముద్రం మాత్రం అపార, అవిచ్చిన్న జలరాశి. అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలం రంగులో కనిపించడానికి కూడా ఇదే కారణం.


సముద్రం ఏర్పడిన తీరు..
సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడటం ప్రారంభించిన తర్వాత, అది క్రమంగా తేలికైన, అలాగే బరువైన రాతి పొరలుగా విడిపోయింది. తేలికైన రాళ్లు పైకి లేచి, భూమి క్రస్ట్ (పటలం) గా, బరువైన రాళ్లు లోపలికి కుంగి భూమి కోర్ (కేంద్రం), మాంటిల్ (క్రస్ట్ కింది పొర) గా ఏర్పడ్డాయి. నూతనంగా ఏర్పడుతున్న భూమి లోపలి రాళ్ల నుంచి జలం పుట్టింది. ఆ రాళ్లు చల్లబడుతుండగా, అవి నీటి ఆవిరిని, ఇతర వాయువులను విడుదల చేశాయి. చివరికి, నీటి ఆవిరి సాంద్రీకృతమై ఒక అనంతమైన మహాసముద్రంగా విస్తరించింది. నేటికీ భూమి లోపలి నుంచి వచ్చే వేడి వాయువులు సముద్రపు అడుగుభాగంలో కొత్త నీటిని ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి.


సముద్రం లేకపోతే మనం బతకగలమా ?
ప్రాణవాయువు ఫ్యాక్టరీ.. మనం పీల్చుకునే ఆక్సిజన్లో దాదాపు 50–70 శాతం సముద్రంలోని చిన్న చిన్న మొక్కలు (ఫైటోప్లాంక్టన్) నుంచి వస్తుంది. అవి అక్కడే ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి, గాలిలోకి పంపిస్తాయి. అవి లేకపోతే, మనకు శ్వాస తీసుకోవడమే కష్టమయ్యేది. అడవులనే కాదు, నిజానికి సముద్రాన్ని ‘భూమి ఊపిరితిత్తులు’ అనాలి.


వాతావరణాన్ని కంట్రోల్ చేసే ఏసీ..
సముద్రం ఒక పెద్ద ఎయిర్ కండిషనర్ లాంటిది. భూభాగాలతో పోలిస్తే- నీరు చాలా నెమ్మదిగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లబడుతుంది. అందుకే సముద్రం వేసవిలో వేడిని గ్రహించి, శీతాకాలంలో తను నిల్వ చేసుకున్న వేడిని విడుదల చేస్తూ ప్రపంచ ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ప్రపంచ ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి సముద్రం సహకరించకపోతే, భూమి ఒకవైపు మండిపోతూ, మరోవైపు ఘనీభవించిపోయేది.
వాతావరణంలో, నీటి చక్రంలో కూడా సముద్రం కీలకపాత్ర పోషిస్తుంది. సూర్యుడి వేడికి నీరు ఆవిరిగా మారి, గాలిలో తేమ పెంచుతుంది. ఈ ఆవిరైన నీటిలో చాలా భాగం మహాసముద్రాల నుంచే వస్తుంది. నీటి ఆవిరి మేఘాలుగా మారి, వర్షం లేదా ఇతర రకాల వర్షపాతం ద్వారా తేమను విడుదల చేస్తుంది. భూమిపై సమస్త జీవం ఈ ప్రక్రియ (నీటి చక్రం – water cycle) పై ఆధారపడి ఉంది.
భారతదేశంలో వచ్చే ఋతుపవన వర్షాలకు కూడా సముద్రాలే ప్రధాన ఆధారం. అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమ గాలుల వల్లే మన దేశానికి వర్షాలు కురుస్తాయి. రైతుల పంటల నుంచి తాగునీటి వరకు.. సముద్రాల ప్రభావం మన దైనందిన జీవితంలో ప్రతిచోటా ఉంటుంది.


కార్బన్ డై ఆక్సైడ్‌‌ను తాగేస్తుంది..
మనం పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వదిలే కార్బన్ డై ఆక్సైడ్ ను సముద్రం గ్రహించేస్తుంది. దాదాపు 30% కాలుష్యాన్ని సముద్రం తనలోకి తీసుకుంటోంది. లేకపోతే గ్లోబల్ వార్మింగ్ ఇంకా ప్రమాదకరంగా మారిపోయేది. అయితే, ఇలా ఎక్కువ CO₂ గ్రహించడం వల్ల సముద్రపు నీరు ఆమ్లంగా (acidic) మారుతోంది – ఇది పగడాలు, మట్టి చిప్పల వంటి జీవులకు ప్రమాదం.


ఆకలి తీర్చే భోజనశాల..
ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్ల మందికి పైగా ప్రజలు తమ జీవనోపాధి కోసం సముద్రాలపై ఆధారపడుతున్నారు. మత్స్యకారులు, పడవ కార్మికులు, చేపల మార్కెట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు .. ఇలా కోట్లాది కుటుంబాల జీవితం సముద్రంతో ముడిపడి ఉంది. భారతదేశానికి దాదాపు 7,500 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ ఉంది. గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు, కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వేలాది గ్రామాలు సముద్రాన్ని ఆశ్రయించి జీవిస్తున్నాయి. ఇది కేవలం వృత్తి కాదు; తరతరాలుగా కొనసాగుతున్న జీవన సంస్కృతి.


రవాణాకు రహదారి..
ప్రపంచంలో దాదాపు 80% వాణిజ్యం సముద్రం ద్వారానే జరుగుతుంది. కంటైనర్ షిప్ లు, ట్యాంకర్లు అన్నీ సముద్రమార్గాలను ఉపయోగించుకుంటాయి. ఇవి లేకపోతే మనకు దొరికే చమురు, ఎలక్ట్రానిక్స్, బట్టలు, మందులు వగైరా దొరకటం చాలా కష్టమవుతుంది. మన రోజువారీ ఖర్చులో నూనె, పెట్రోలు ధరలు కూడా సముద్రం మీదే ఆధారపడి ఉంటాయి.

The ocean... the foundation of life and livelihood.


జీవ వైవిధ్య నిలయం..
భూమిపై జీవం వర్ధిల్లడానికి సముద్రమే ప్రధాన కారణం. అద్భుతమైన జీవవైవిధ్యానికి నిలయం. సముద్రాలు లక్షలాది జీవజాతులకు నివాసం. సూక్ష్మజీవుల నుంచి మహా తిమింగలాల వరకు అనేకరకాల జీవులు సముద్రాల్లో నివసిస్తాయి. రంగురంగుల పగడపు దిబ్బలు, ప్రకాశించే జెల్లీఫిష్ లు, సముద్ర గుర్రాలు, ఆక్టోపస్ లు — సముద్ర జీవ ప్రపంచం నిజంగా ఒక అద్భుతం. శాస్త్రవేత్తలు ఇప్పటికీ సముద్రంలోని చాలా భాగాన్ని పూర్తిగా అన్వేషించలేదు. అంటే ఇంకా ఎన్నో తెలియని జీవులు, రహస్యాలు సముద్రగర్భంలో దాగి ఉండొచ్చు. ఇప్పటివరకు మనకు తెలిసినట్లుగా, సుమారు 22 లక్షలకు పైగా సముద్ర జాతులు ఉన్నాయి. వాటిలో చాలావరకూ నేటికీ మనకు తెలియవు. ఈ వైవిధ్యమే భూగోళం స్థితిస్థాపకతను కాపాడుతుంది. ఒక జాతి అంతరించిపోతే, ఆ ఆహారపు గొలుసు మొత్తం దెబ్బతింటుంది.


సముద్రాలు, మహాసముద్రాలు..
సప్త సముద్రాలు అనే పదబంధం శతాబ్దాలుగా వాడుకలో ఉంది. కానీ ఆ పదం వాస్తవానికి మహాసముద్రంలోని వివిధ భాగాలను, అనేక ఇతర పెద్ద జలరాశులను సూచిస్తుంది. సాధారణంగా, సముద్రం అనేది మహాసముద్రంలోని ఒక భాగంగా నిర్వచించబడుతుంది. ఇది పాక్షికంగా భూమిచే చుట్టుముట్టబడి ఉంటుంది. ఆ నిర్వచనం ప్రకారం, ప్రపంచంలో సుమారు 50 సముద్రాలు ఉన్నాయి. వలన భవిష్యత్తు బొగ్గైపోతుందన్న సోయ కూడా ఉండదు.


సుస్థిర మత్స్య పద్ధతులు..
చేపలను సుస్థిరంగా పట్టే మార్గాలు ఉన్నాయి – వీటిద్వారా మనం సీఫుడ్ ను ఆస్వాదిస్తూనే, భవిష్యత్తు కోసం చేపల జనాభాను కాపాడుకోవచ్చు. అనేక_సంస్కృతులలో, ప్రజలు వేల సంవత్సరాలుగా సుస్థిరంగా చేపలు పడుతున్నారు. నేటి సుస్థిర మత్స్య పద్ధతులు ఈ సంస్కృతుల నుండి నేర్చుకున్న కొన్ని పాఠాలను ప్రతిబింబిస్తాయి.
ఫిలిప్పీన్స్, తగ్బనువా ప్రజలు సాంప్రదాయకంగా చేపల జనాభాను కాపాడుతూనే, వాటిని పట్టే పద్ధతులను అనుసరిస్తున్నారు. వారు నిర్దిష్ట జాతుల చేపలను ఏడాదిలోని నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పడతారు – ఇది_సీజన్లు, చంద్రునిపై ఆధారపడి ఉంటుంది.. తద్వారా చేపలు_తమ సంఖ్యను_తిరిగి నిలుపుకోగలుగుతాయి. వారు_పగడపు దిబ్బలు_వంటి కొన్ని ప్రాంతాలను చేపలు పట్టడానికి_నిషేధించబడిన_సంరక్షిత ప్రదేశాలుగా నిర్దేశిస్తారు. వారు తమకు అవసరమైనంత మాత్రమే పడతారు.


సస్టైనబుల్ ఫిషింగ్ అంటే మరింత ఎక్కువ …
ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచం మొత్తం ‘ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం’ (World Oceans Day) జరుపుకుంటుంది. ఈ ఏడాది థీమ్: ‘సస్టైనబుల్ ఫిషింగ్ అంటే మరింత ఎక్కువ ‘ (Sustainable Fishing Means More). ఈ థీమ్ ద్వారా, అతిగా చేపలు పట్టడం వల్ల కలిగే నష్టాలను తగ్గించి, భవిష్యత్ తరాలకు సురక్షితమైన సముద్ర జీవవైవిధ్యాన్ని అందించడం లక్ష్యంగా చేసుకుంది.

The ocean... the foundation of life and livelihood.


​భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి..
భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారు దేశంగా ఉంది. అయితే, అతిగా చేపలు పట్టడం, చట్టవిరుద్ధమైన చేపల వేట, పర్యావరణ కాలుష్యం వల్ల సముద్ర వనరులు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయి. భారత తీర ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో చేపల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రత్యేకించి, సాంప్రదాయ మత్స్యకారులు ఆధునిక పద్ధతులతో పోల్చలేని పరిస్థితులలో నిమగ్నమై ఉన్నారు.


ప్రయత్నాలు..
భారత ప్రభుత్వం ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ (PMMSY) ద్వారా మత్స్య రంగానికి భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ పథకంలో సస్టైనబుల్ ఫిషింగ్ పద్ధతులు, చిన్న తెప్పల (traditional crafts) యాంత్రీకరణ, సముద్ర నీటి సాగు (mariculture) ప్రోత్సహించబడుతున్నాయి. అదే సమయంలో ఎక్కువ చేపలు పట్టే నౌకలపై (fishing vessels) పర్యవేక్షణను పెంచుతున్నారు.


స్థానిక సంఘాలకు మద్దతు..
మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs) స్థానికంగా చేపల ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి పనులలో నిమగ్నమై, ఆర్థిక స్వావలంబన సాధించడానికి ప్రోత్సహించాలి. ఇటీవల కేరళలోని కొన్ని ప్రాంతాల్లో, ‘సముద్ర సంరక్షణ కమిటీలు’ ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి స్థానిక మత్స్యకారులు పర్యావరణవేత్తలను కలిపి పనిచేస్తాయి. ఈ కమిటీలు నిషేధిత సాధనాలను గుర్తించి, నివేదించడంలో సహాయపడతాయి.
స్థిరత్వం (sustainability) అనేది కేవలం చేపలను మాత్రమే కాకుండా, దానితో ముడిపడి ఉన్న ఆర్థిక, సామాజిక పర్యావరణ అంశాలన్నింటినీ కలిగి ఉంటుంది. స్థిరమైన చేపల వేట అనేది మన ప్రస్తుత అవసరాలను తీర్చేటప్పుడు రేపటి తరాల అవసరాలతో రాజీ పడకుండా ఉండే ఒక మార్గం. సరైన నియంత్రణలు, సాంకేతిక అభివృద్ధి కమ్యూనిటీ భాగస్వామ్యంతో, మన అద్భుత సముద్రాలను కాపాడుకోవచ్చు. ఎంత కాలం సముద్రంలోని వనరులను అలా దోపిడీ చేస్తూ ఉండగలం అని ఈ సందర్భంగా మనం ఆలోచించుకోవాలి. మార్పు మన చేతుల్లోనే ఉంది !


పరిష్కారాలు..
సముద్ర సంరక్షిత ప్రాంతాలను (Marine Protected Areas) పెంచడం:_ఈ ప్రాంతాల్లో చేపలు పట్టడాన్ని నిషేధించడం లేదా నియంత్రించడం వలన చేపల సంఖ్య పునరుద్ధరించబడుతుంది.

ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం:_మత్స్యకారులకు పర్యాటకం, కోతల తయారీ, ఇతర స్థానిక పరిశ్రమలలో శిక్షణ ఇవ్వడం.


చైతన్యం :_స్థానిక సమాజాలకు సస్టైనబుల్ ఫిషింగ్ ప్రయోజనాలు సముద్ర పరిరక్షణ గురించి వివరించడం.
నియంత్రణలు కఠినతరం చేయడం:_చట్టవిరుద్ధమైన చేపల వేటను నిరోధించడానికి నౌకా దళం తీర రక్షక దళాల సహకారంతో కూడిన సమర్థవంతమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం.


మనం ఏం చేయాలి ?
• ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి._సముద్రంలో చేరే ప్లాస్టిక్ చేపలు, తాబేళ్లు, పక్షులను చంపేస్తుంది.
• చేపలు పట్టడంలో బాధ్యతగా ఉండాలి._అతిగా చేపలు పట్టకూడదు; చిన్నచిన్న చేపలు పట్టే వలలను వదిలించుకోవాలి.
• బీచ్‌ ‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి_– మనిషి వదిలే చెత్త, టిన్ లు, సిగరెట్ వంటివి సముద్రానికి చేరి, నీటిని కలుషితం చేస్తాయి.
• సస్టైనబుల్ ఫిషింగ్_కు మద్దతివ్వడం – వేసే నెట్లు, ట్రాలర్లు సర్టిఫైడ్ గా ఉండాలి.

The ocean... the foundation of life and livelihood.


‘అనంతం’ అనే భ్రమకు ముగింపు..
మహాసముద్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా ప్రాణాధారంగా మారింది. ఇది ప్రజలకు, ప్రపంచ ఆర్థికవ్యవస్థకు భౌతిక, అభౌతిక వస్తువులు, సేవలను అందిస్తుంది. మానవ శ్రేయస్సు సముద్రంపై ఎంతగా ఆధారపడి ఉందో, అలాగే మహాసముద్రాలు, సముద్రాల పరిస్థితి దిగజారినట్లయితే ఎంత ప్రతికూల ప్రభావాలు ఉంటాయో ఇప్పటికే మనకు అవగతమౌతున్నాయి.
సముద్ర వినియోగం కోసం కొత్త స్థిరమైన (sustainable) వ్యూహాలను అభివృద్ధి చేయడం ఒక సవాలుగా మారింది. దీనికి సాధ్యమైన ఒక పరిష్కారం_నీలి ఆర్థిక నమూనా_(blue economy model). దీని లక్ష్యం, సముద్రంపై రాజకీయ లేదా ఆర్థిక నిర్ణయాల సంభావ్య ప్రభావాలను అంచనా వేయడం, వాటిని ముందుగానే చర్చించడం. అయితే, సముద్ర నిర్లక్ష్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నవారు, సాంప్రదాయ ఆర్థిక నమూనాలను పూర్తిగా త్యజించి, పర్యావరణ భావనల వైపు మళ్లాలని పిలుపునిస్తున్నారు.
వేల సంవత్సరాలుగా, మానవాళి సముద్రంతో పాటు జీవించింది. సముద్రం నుంచే తన జీవనాన్ని సాగించింది. అన్ని కాలాల్లో దాన్ని అంతులేనిదిగా, ఆహారం ఇంకా ఇతర వనరులను అందించడంలో అపరిమితమైనదిగా, మానవ దురాక్రమణకు లొంగనిదిగా భావించింది. కానీ ఇప్పుడు మానవ తప్పిదాల పరిణామాలు ఎప్పటికప్పుడు అధికంగా, స్పష్టంగా కనిపిస్తున్నాయి. పగడపు దిబ్బలు చనిపోతున్నాయి. తీర ప్రాంతాలు కూలి, కృశించి, నశించి పోతున్నాయి. చాలా ప్రాంతాలలో మత్స్యకారులు ఖాళీ వలలు లాగుతున్నారు. ఇది స్పష్టంగా తెలుస్తుంది.
మనం సముద్ర సంపద నుండి ప్రయోజనం పొందాలనుకుంటే, దాన్ని గౌరవంగా చూసుకోవాలి, పైగా, భూ గ్రహం మీది అతిపెద్ద ఆవాసానికి కూడా పరిమితులు ఉన్నాయని గుర్తించాలి.


ప్రమాదపు లోతుల్లో చేపలు..
బ్లూఫిన్ ట్యూనా_అనే ఒక అందమైన చేప ఉంది. ఇది 15 అడుగుల పొడవు, సుమారు 700 కేజీలు బరువు వరకూ పెరుగుతుంది. ఇది గంటకు దాదాపు 70 కి.మీ. వేగంతో ఈదగలదు. అయితే ఇవన్నీ పక్కనపెడదాం (ఈ చేపను తినేవాళ్లకు ఇవన్నీ రుచించవు గనుక!). వాళ్లకు రుచించేది దీని పొట్ట మాంసం. ఒకసారి వేలంలో ఇది సుమారు ₹26 కోట్ల ధర పలికింది. దీనిని పచ్చిగా,_సుషీగా_తింటారు. ఈ చేప కోసం డిమాండ్ కారణంగా దాని ఉనికే ప్రమాదంలో పడింది. 1970లో ఉన్న దాని జనాభాతో పోలిస్తే, ప్రస్తుతం అందులో 21 – 29 శాతం మాత్రమే ఉంటుందని అంచనా.
ఏ విషయాన్నైనా చులకన చేయడానికి ‘సముద్రంలో నీటిబొట్టంత’ అంటుంటాం. సముద్రం నుండి పట్టుకునే చేపలను కూడా అదేవిధమైన చులకన భావంతో చూస్తాం; ఓ బుట్టెడు చేపలు ఎక్కువ పట్టుకుంటే ఏం పోతుంది, సముద్రంలో చేపలు కరువా అని.
ప్రతి సంవత్సరం మత్స్యకారులు 770 కోట్ల కిలోగ్రాములకు పైగా సముద్ర ప్రాణులను వేటాడుతున్నారు. ఇదేవిధంగా చేపలు పట్టడం కొనసాగిస్తే, త్వరలో ప్రపంచ మత్స్య పరిశ్రమ కూలిపోయే ప్రమాదం ఉందంటున్నారు.
ఆధునిక వేట పరికరాలు, పద్ధతులు వాడి వాణిజ్య మత్స్యకారులు ఒకేసారి వేలకొద్దీ చేపలను పట్టుకోగలుగుతున్నారు. ఒకేసారి చాలా చేపలను పట్టుకోవడం వలన మత్స్యకారులకు తక్షణ లాభం లభిస్తుంది. అయితే ఈ కారణంగా సముద్రంలో ఒక జాతికి చెందిన చేపలు చాలా తక్కువగా మిగులుతాయి. ఒక చేపల జనాభా చిన్నగా ఉంటే, అది పునరుత్పత్తి ద్వారా తిరిగి నింపుకోలేదు. చేపలు తమ జనాభా పునరుత్పత్తి చేయగల దానికంటే వేగంగా వాటిని సముద్రం నుండి తీసివేయడాన్ని_అతిగా చేపలు పట్టడం_(overfishing) అంటారు. అతి సర్వత్ర వర్జియేత్ అంటారు. మనం వింటాం గానీ పాటించం. బంగారు బాతుగుడ్డు చందంగా అందినకాడికి అమాంతం దోచేయడమే అలవాటు. ఈ దురలవాటు


సస్టైనబుల్ ఫిషింగ్ అంటే ?

సాధారణ చేపలు పట్టడం, సస్టైనబుల్ ఫిషింగ్ మధ్య చాలా తేడా ఉంది. సస్టైనబుల్ ఫిషింగ్ అనేది సముద్ర పర్యావరణ వ్యవస్థలపై ప్రభావాన్ని తగ్గిస్తూ, భవిష్యత్తులో కూడా చేపల సంఖ్య సమృద్ధిగా ఉండేలా చూసే ఒక పద్ధతి. ఇందులో భాగంగా:
అతిగా చేపలు పట్టడాన్ని నివారించడం:_ఒక ప్రాంతంలో చేపల సంఖ్య తగ్గకుండా, సహజంగా వాటి సంతతి పెరిగే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం.
నిషేధిత సాధనాలను నివారించడం:_చిన్న చిన్న చేపలు కూడా చిక్కేలా ఉండే ‘ట్రాల్ నెట్లు’ వంటి సాధనాలను నివారించడం.
నిర్దిష్ట కాలాలలో మాత్రమే చేపలు పట్టడం:_చేపల సంతానోత్పత్తి సమయంలో వాటిని కాపాడటానికి, కొన్ని సమయాల్లో చేపలు పట్టడాన్ని నిలిపివేయడం ఉన్నాయి.

The ocean... the foundation of life and livelihood.


ప్రయోజనాలు..

‘సస్టైనబుల్ ఫిషింగ్’ నేటి తరానికి ఆహారాన్ని అందించడంతోపాటు, రేపటి తరానికీ అదే వనరులు అందుబాటులో ఉండేలా చూస్తుంది. ఇది ఒక సామూహిక బాధ్యత.
సముద్ర జీవవైవిధ్య పరిరక్షణ:_సముద్రంలోని అన్ని జీవజాలాల సంతులనాన్ని కాపాడుతుంది.
ఆర్థిక భద్రత:_భవిష్యత్తులో మత్స్యకారులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది.
ఆహార భద్రత:_వచ్చే తరాలకు కూడా చేపలు అందుబాటులో ఉండేలా చేస్తుంది.
వాతావరణ మార్పులను నిరోధించడం:_ఆరోగ్యకరమైన సముద్రాలు కార్బన్ డై ఆక్సైడ్ ను ఎక్కువగా గ్రహించి, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తాయి.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్