test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తొందరపాటు

17 మే, 2026

తొందరపాటు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 07:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చాలాకాలం నుండీ

కాలనీలొ నివసించే

కొటేశ్వర రావు గారు

కొత్తకారు కొని తెచ్చిరి!!

ఆ రోజున దీపావళి

ఊరంతా పెనుసందడి!

పిన్నా పెద్దా అందరు

వేడుకను జరుపుకొందురు!!

పిల్ల లేమొ టపాసులని

అల్లరి చేస్తున్నారని

డబడబ బజారుకెళ్లీ

టపాసులను కొని తెమ్మని

కోటేశ్వరరావు గార్ని

కోరిందీ భార్యా మణి!

వెంటనె కోటేశ్వ ర్రావు

వెళ్లినాడు స్కూటరుపై!!

అతడు తిరిగి వచ్చుసరికి

అపుడెకొన్న కొత్తకారు

అద్దమొకటి పగిలి వుండె

బద్దలగున అతని గుండె?

చిన్నకొడుకు చేతిలోన

వున్న‘రోలురోకలి’ గని

వాడే తన కారద్దము

పగులగొట్టి నాడనుకొని

విచక్షణా రహితంగా

పిల్లవాడ్ని కొట్టినాడు!

స్పృహ తప్పీ సొమ్మసిల్లె

చిన్నకొడుకు పెను వెంటనె!!

అంతలొ ఒక పెద్దాయన

అరుదెంచెను అచ్చటికీ!

“అయ్యా! నను క్షమించండి

అది నా ముది మనుమని పని!!

నేల టపాకాయ విసిర

నేరము చేశాడు వాడు!

ఇచ్చుకొండి పరిహారం

పుచ్చుకోందు వద్దనకా!!

“తొందరపాటు నాదేను

అందరు నను క్షమించండి’’

అని కోటేశ్వర రావూ

తన తప్పను ఒప్ప్పుకొనెను!!


- ‘బాలబంధు’అలపర్తి వెంకటసుబ్బారావు

(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)

94408 05001​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్