తెనాలి బేబీ
తెనాలి జిలేబి!
అనాలి అది తిని
అమృతమ్మేనని!
బెల్లం జిలేబి
ఉల్లం జిల్లను!
తేనెల జిలేబి
తృప్తిగ వుండును!!
నేతి జిలేబి
ప్రీతిమైనదీ!
కాజు జిలేబి
కమ్మనైనదీ!!
ఒకే వీధిలో
ఉన్నట్టి వరుస
దుకాణాలలో
దొరుకును జిలేబి!!
పిలిచెద రందరు
‘జిలేబి బజారు’
అని ఆ వీధిని
తనివి తీరగా!!
తెనాలి జిలేబి
తెలుగు రాష్టాల
విస్తరించింది
వివిధ ప్రాంతాల!!
‘బాలబంధు’ అలపర్తి వెంకటసుబ్బారావు
(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)
9440805001








కామెంట్‌లు (0)