test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పిల్లల వేసవి ప్రత్యేక సంచిక – బాలల రచనలకు ఆహ్వానం .. !

6 రోజుల క్రితం

ప్రియమైన చిన్నారులూ,
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రియమైన చిన్నారులూ,

వేసవి సెలవుల సందర్భంగా “ప్రజాశక్తి” *స్నేహ* అనుబంధం మీ కోసం
ఒక ప్రత్యేక సంచికగా వెలువడుతుంది. పిల్లల సంతోషమే మా సంతోషం.
ఇందులో మీరు రాసే రచనలకు, గీసే బొమ్మలకు ప్రాధాన్యతనిచ్చి, ప్రచురిస్తాం.
కథలు, కవితలు, బొమ్మలు, పుస్తక సమీక్షలు.. ఇలా అన్ని రచనా ప్రక్రియల్లోనూ
మీ సృజనకు ఈ సంచికలో చోటుంటుంది.
మీరు రాసిన కథ, కవిత, కనువిందు చేసే బొమ్మలూ,
వేసవిలో మీరు సందర్శించిన ప్రదేశాలు, మీరు చదివిన పుస్తకాలపై సమీక్షలు వంటివన్నీ ప్రచురిస్తాం!!
ఈ సంచికలో ప్రచురితం కాని రచనలు తర్వాత సంచికల్లో వీలునుబట్టి ప్రచురిస్తాం..
అయితే మూఢ నమ్మకాలను, దేవుళ్లు, దెయ్యాలు.. వంటి
అతీత శక్తులను బలపరిచే రచనలను ప్రచురించలేము.
ప్రజల ఐక్యత, సమానత్వం, మత సామరస్యం అంశాలపై శాస్త్రీయ దృక్పథంతో కూడిన
మీ కథలు, గేయాలు, చిత్రాలు పంపండి.
ఇంకా పెద్ద పెద్ద రచయితలు / రచయిత్రులు కూడా చక్కని కథలు రాస్తారు.
గొప్ప గొప్ప చిత్రకారులు బొమ్మలు గీస్తారు. అవన్నీ మీ కోసమే!
జూన్ 14వ తేదీన వచ్చే ఈ సంచిక మీకొక గొప్ప కానుక మాత్రమే కాదు..
చక్కని జ్ఞాపిక కూడా అవుతుంది. మీరంతా పదిలంగా దాచుకునేలా ఈ ప్రత్యేక సంచికను రూపొందిద్దాం.
దీనికి మీ అందరి సహాయం, భాగస్వామ్యం అందించాలి.
ఎందుకంటే ఈ సంచిక మీదే!


దీని రూపకర్తలూ మీరే! మరెందుకు ఆలస్యం ?

సంపాదకులు


పుస్తకాలు కావాల్సినవారు
ఈ కింది నెంబరులో సంప్రదించండి.
9490099422


చిరునామా .. 

మెయిల్ ద్వారా
chirumuvvalupraja@gmail.com


పోస్టు ద్వారా

స్నేహడెస్క్, ప్రజాశక్తి భవనం,
డోర్ నెం:12-402/1/1, అమరారెడ్డి కాలనీ,
అరవింద హైస్కూలు దగ్గర,
కుంచనపల్లి, తాడేపల్లి,
గుంటూరు జిల్లా -522501.
ఫోన్ నెం :9490099006.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్