ఐపిఎల్ : ఐపిఎల్ 2026 సీజన్ యువ సంచలనం సూర్య వంశీకి మరపురాని అనుభవంగా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ 15 ఏళ్ల యువ బ్యాటర్ అద్భుత ప్రదర్శనతో పలు రికార్డులు నెలకొల్పడమే కాకుండా భారీ మొత్తంలో నగదు బహుమతులు కూడా సొంతం చేసుకున్నాడు.
సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రయికర్, సూపర్ సిక్సెస్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా దక్కించుకున్నాడు. ఈ అవార్డుల ద్వారా అతడికి రూ.55 లక్షల నగదు బహుమతులు లభించాయి. అదనంగా సూపర్ స్ట్రయికర్ అవార్డుతో టాటా సియెర్రా కారును కూడా గెలుచుకున్నాడు.
మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ.1.1 కోట్లకు కొనుగోలు చేయగా, సీజన్‌లో ఆడిన 16 మ్యాచ్‌లకు మ్యాచ్ ఫీజుల రూపంలో మరో రూ.1.2 కోట్లు అందుకున్నాడు. కాంట్రాక్ట్ మొత్తం, మ్యాచ్ ఫీజులు, సీజన్ అవార్డుల విలువ కలిపి అతడి ఆదాయం సుమారు రూ.2.85 కోట్లకు చేరింది.
ఇంకా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మోస్ట్ సిక్సెస్, ఎలక్ట్రిక్ స్ట్రయికర్ వంటి మ్యాచ్‌ల వారీ అవార్డుల ద్వారా కూడా అదనపు నగదు బహుమతులు అందుకున్నాడు. దీంతో ఈ సీజన్‌లో వైభవ్ మొత్తం ఆదాయం రూ.3 కోట్లకు మించి ఉండొచ్చని అంచనా. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే రికార్డులు, అవార్డులు, ఆదాయంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తు తారగా ప్రశంసలు అందుకుంటున్నాడు.









కామెంట్‌లు (0)