డల్లాస్(అమెరికా): డల్లాస్ స్టేడియంలో సోమవారం ఉదయం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో నెదర్లాండ్స్‌ను ఆసియాఖండ జట్టు జపాన్ నిలువరించింది. గ్రూప్-ఎఫ్ తొలి మ్యాచ్‌లో మూడుసార్లు ఫిఫా ప్రపపంచకప్ రన్నరప్ నెదర్లాండ్స్ ను జపాన్ అడ్డుకున్న తీరు అత్యద్భుతం. దీంతో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్ తో డ్రా అయ్యింది. దీంతో ఇరుజట్ల కు ఒక్కో పాయింట్ దక్కగా.. ఒక పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో డైచి కమాడా చేసిన గోల్ జపాన్‌కు ఓటమి నుంచి గట్టెక్కించింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడటంతో.. తొలి అర్ధభాగం ఎలాంటి గోల్ నమోదు కాలేదు. అయితే రెండో అర్ధభాగంలో ఆట పూర్తిగా మారింది. ఇరుజట్ల ఆటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లు ఆడారు. దీంతో మ్యాచ్ వేగం పుంజుకుని ఏకంగా నాలుగు గోల్స్ నమోదయ్యాయి. రెండుసార్లు ఆధిక్యంలోకి వెళ్లిన నెదర్లాండ్స్ విజయం దిశగా సాగినా.. చివరి వరకు జపాన్ పట్టుదలతో పోరాడి డ్రా మ్యాచ్ ను ముగించింది. మొదటి గోల్ ను నెదర్లాండ్స్ సాధించింది. రయాన్ గ్రావెన్‌బెర్చ్ ఇచ్చిన అద్భుతమైన పాస్ ను కెప్టెన్ వర్జిల్ వాన్ డైక్ హెడ్డర్ ద్వారా గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యం అందించాడు. అయితే జపాన్ వెంటనే స్పందించింది. కైటో నకమురా అద్భుతమైన లో షాట్‌తో స్కోరును 1-1తో సమం చేసింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. కేవలం తన మూడో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న క్రైసెన్సియో సమ్మర్విల్లే ఎడమ వైపు నుంచి లోపలికి కట్ చేసి, అద్భుతమైన కర్లింగ్ షాట్ తో గోల్ సాధించాడు. ఆ బంతి పోస్ట్‌ను తాకుతూ నెట్‌లోకి వెళ్లడంతో నెదర్లాండ్స్ 2-1 ఆధిక్యం సాధించింది. సమయం తగ్గుతున్న జపాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. సమం చేసే గోల్ కోసం బాగా ప్రయత్నించింది. చివరకు మ్యాచ్ ముగియడానికి కొద్ది నిమిషాల ముందు వచ్చిన కార్నర్‌ను ప్రత్యామ్నాయ ఆటగాడు కోకి ఒగావా హెడ్డర్ తో గోల్ వైపు మళ్లించాడు. ఆ బంతిని డైచి కమాడా స్వల్పంగా తాకడంతో దిశ మారి గోల్‌పోస్ట్ లోకి వెళ్లింది. దీంతో స్కోరు 2-2గా మారి జపాన్ అభిమానుల్లో సంబరాలు వెల్లువెత్తాయి.
స్వీడన్ చేతిలో ట్యునీషియా చిత్తు
ఉత్తర అమెరికాలోని గ్వాడలూపే వేదిక జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్ లో పటిష్ట స్వీడన్ జట్టు కరేబియన్ జట్టు ట్యూనీషియాను చిత్తు చేసింది. స్వీడన్ తరఫున 22 ఏళ్ల యాసిన్ అయారి కీలక పాత్ర పోషించాడు. దీంతో స్వీడన్ జట్టు 5-1 గోల్స్ తేడాతో ట్యునీషియాపై ఘన విజయం సాధించింది. ఆట ప్రారంభమైన ఏడు నిమిషాలకే_యాసిన్ అయారి గోల్ కొట్టి స్వీడన్‌కు ఆధిక్యం ఇచ్చాడు. ఆ తర్వాత అలెక్సాండర్ ఐసాక్ (30వ నిమిషం) గోల్‌తో స్వీడన్ 2-0 లీడ్ సాధించింది. అయితే, ట్యునీషియా ఆటగాడు ఒమర్ రెకిక్ 43వ నిమిషంలో గోల్ కొట్టాడు. దీంతో స్వీడన్ ఆధిక్యం 2-1కి తగ్గింది. కానీ, పదేపదే ట్యునీషియా గోల్ పోస్టుపై ఎటాక్ చేసిన స్వీడన్ ఫలితాన్ని సాధించింది. విక్టోర్ (59వ నిమిషం), మాట్టియస్ (84వ నిమిషం) గోల్స్‌తో స్వీడన్ విజయం ఖరారు అయింది. అదనపు ఆరు నిమిషాల ఆటలో యాసిన్ అయారి మరో గోల్ కొట్టి స్వీడన్‌కు 5-1 ఆధిక్యం అందించాడు.
చివర్లో గోల్ కొట్టి ఐవరీ కోస్ట్ కూడా...
గూప్-ఇలో ఉత్కంఠభరితంగా సాగిన మరో ఫిఫా మ్యాచ్ లో ఐవరీ కోస్ట్ చివర్లో గోల్ కొట్టి విజయం సాధించింది. ఈక్వెడార్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 1-0 తేడాతో సంచలన విజయం సాధించింది. ఆఖరి వరకు నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఐవరీ కోస్ట్ మిడ్ ఫీల్డర్ అమడ్ డియాల్లో (ఆట 90వ నిమిషంలో) గోల్ కొట్టడంతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. దీంతో గత 19 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని ఈక్వెడార్‌కు ఐవరీకోస్ట్ షాక్ ఇచ్చింది. ఇక జర్మనీ 7-1 తేడాతో కురాకావోపై విజయం సాధించింది. దీంతో గ్రూప్-ఇలో జర్మనీ, ఐవరీ కోస్ట్ 3 పాయింట్లతో టాప్-2లో ఉన్నాయి.









కామెంట్‌లు (0)