తమిళనాడు : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే తలపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా, ప్రజలకు అసౌకర్యంగా ఉన్న 717 వైన్ షాపులను రాబోయే 2 వారాల్లోగా మూసివేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, యాత్రికుల మనోభావాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్నవి, ఆలయాలు, చర్చిలు, మసీదులకు దగ్గరగా ఉన్నవి, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు వెలువడ్డాయి. కాగా, తమిళనాడు రాష్ట్ర వాణిజ్య సంస్థ (TASMAC) ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 4,765 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. అందులో నిబంధనలు విరుద్ధంగా 717 మద్యం దుకాణాలు నడుస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. వాటన్నింటినీ 2 వారాలు అంటే 14 రోజుల వ్యవధిలో పూర్తిగా మూసివేయించాలని సిఎం విజయ్ అధికారులను ఆదేశించారు.
వైన్ షాపులు మూసివేత - సిఎం విజయ్ సంచలన నిర్ణయం
12 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 12, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)