test1
శుక్రవారం, 12 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాకలూ! కేకలూ!!

4 గంటల క్రితం

lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 12, 2026, 06:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

"అకేషనూ..లోకేషను బట్టి ఎమోషను ఉండాలి గానీ, ఏడ్సినోళ్లని ఎక్కిరించడానికి ఒచ్చినట్టుంది. చదవేస్తే ఉన్న మతి పోయిందని ఊరకే అన్నారేటి పెద్దలు!"
స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరామర్శకు వచ్చి, కార్మిక సంఘాల నాయకుల మీద కస్సుబుస్సుమన్న లోకేష్ బాబు వ్యవహారం, కార్మికుల రక్షణ బాధ్యత యూనియన్లదేనన్న పవన్‌ ‌కల్యాణ్‌ ‌మాటలు బొత్తిగా నచ్చలేదు దశుమంతు నాయుడుకి.
మరీ బొత్తిగా నచ్చలేదు పరదేశికి--
" మనుషులు మాంసం ముద్దలైపోయి.. ఏది, ఎవరిదో తెలీక ..కుటుంబాలు..తోటి కార్మికులు.. కలిసి పనిచేసిన లీడర్లు ..గోడు గోడున ఏడుస్తుంటే, ఏవో నాలుగు ఓదార్పు మాటలు చెప్పీసీ, గుండెలు సల్లబరిచీసీ ..లీడరన్నోడు ఒచ్చియ్యాల! కడుపు మంటతో ఏవో నాలుగు మాటలు అంటే అంటారు ..నాలుగు ప్రెశ్నలు ఏస్తారు మరి! తెలిస్తే తెలిసింది సెప్పాలా! లేపోతే పక్కనే ఉన్నాది గదా! హోంమంత్రమ్మ..ఆయమ్మతో సెప్పించియ్యాల.. అనుకొని అన్నిట్లో వేలెట్టీస్తే సిదిగిపోదేటి?"-- నాయుడు చిరాగ్గా వాలు కుర్చీలో చేరబడి.. తాపీగా చుట్ట తీసి నోట్లో పెట్టుకున్నాడు.
" సిచ్యేషను ఒకలాగా వుంటే, సిచ్చుబుడ్డీ లాగా సిరాకుపడిపోవడమేటీ "-- ముట్టించాడు పరదేశి.
" ఎకా ఎకీన రష్యా నుంచి ఒచ్చేసాడు..ఏటి నేర్సుకున్నాడో! కళ్ళుసాగదీసి కస్సుబుస్సుమనీడమేటి! పెదబాబుకి పెద్ద పని లేకుండా, భారం మోస్తాడనుకుంటే, ఇలా వుంది యెవ్వారం!"
" అవునన్నా! పెదబాబు గోరు రాలేదేటీ?"
" బాబులకి బాబు..ఎవులు? డిల్లీ బాబు..ప్రెధాని పీటెక్కి పుష్కరమైందట! సిడతల కూటమి పండగ సేస్కోవద్దా?"
" పుష్కరమనగానే, మనోడి మనసు తుళ్లిపడి గోదార్లో పిల్లిమొగ్గలేత్తాది గదా!"--కిచ కిచమన్నాడు పరదేశి..చుట్ట నుసి( బూడిద ) దులపడానికి టీపాయ్ మీద ఇసుక నింపిన కప్పు పెట్టాడు.
దులిపి--
" మీ ఇంట్లో ఎవరూ సెనిపోలేదు కదా! మీకేటి బాధ? అని అడిగాడట! కష్టం.. నష్టం దగ్గర ఇష్టమొచ్చినట్టు మాట్లాడీగూడదు! ఓపికుండాల .. ముఖ్యంగా పాలిటిక్స్ లో ఉన్నోళ్ళకీ.. ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నోళ్లకి!"
" నిజమేనన్నా! మన పల్లా శీను బాబుని సూడూ..జనమూ, లీడర్లు సుట్టుముట్టీసి, నష్టపరిహారం కోటి రూపాయలు ఎనవ్సు సెయ్యాలని అరుస్తుంటే ..ఎంత సేకసెక్యంగా నోరిప్పకుండా.. ఊరు గాని ఊర్లో పర్సు జారిపోయినట్టు ..మొహం పెట్టీసి ..సల్లగా జారిపోనాడు ..అద్గదీ..అలాగుండాల.. పోలిటిక్సులో!"
పెద్ద దుకాణమెడతాను.. పెద్ద కంపెనీ పెడతాను.. అని వొచ్చినోళ్ళకి, అదీ, కోటాను కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళకి-- ఎకరా కోటి రూపాయలుంటే, పావలాకి..అర్ధకీ"-- నాయుడు మాటలు పూర్తి చేయకముందే," పైసా తక్కువ రూపాయికి"- అని ముగించాడు పరదేశి.
" కదా! నాలుగైదేళ్ల నుంచి కంపెనీ అమ్మేస్తారో !మూసేస్తారో !?తెలీక.. కుటుంబం మధ్య నవ్వలేక, ఏడవలేక ..జబ్బలు జారిపోయి.. సేతులు ఒణికిపోయి.. గాడిద సాకిరీ సేసి.. సివరకి ఇలాగ దిక్కుమాలినసావు సస్తే ..కోటి రూపాయలు ఇవ్వడానికి ఈళ్ళకి సలుపా ? ఎవుడి తాత, ముత్తాతల జాగీరు!?"--
ఎప్పుడూ లేదు, చుట్ట మీద గంజాయి అయిపోయాడు, నాయుడు.
" అన్నా! జాగీరంటే గుర్తొచ్చింది. మన ఎగుర్లోడు కూడా వచ్చి, లొకేషు లాగే కీకలేస్తాడేటీ? కూడబలుక్కుని ఒచ్చినారేటి ఇద్దరూ! సంఘాలే కంపెనీని తగలెట్టీసినాయంటాడు! ఇకారమా! శకారమా?"
" ముందు, మనోడని.. ఏదో అనుకున్నాను గానీ, వేస్ట్.. సినిమా తైతక్కలు .. పాటలు..ఈ లెక్కలు పోలిటిక్స్ లో వర్కవుట్ కావు." చుట్ట సగానికి కాలింది. తీసి ..చూసి.. కాలిన నుసి ( బూడిద )ఇసుకప్పులో దులిపేశాడు.
" కూటమిలోకి రాకముందు, కమ్మీనిస్టులతో తిరిగి.. ఇప్పుడు, ఆ సిద్ధాంతమే సచ్చిపోయిందంటన్నాడు. మోడీ కౌగిలించుకున్న తర్వాత , సిన్న మెదడు గాని సిదిగిపోయిందేటీ!?"
" ఈరంగమెయ్యడం తప్ప, ఇతగాడొచ్చి ఏటి ఉద్ధరించీసినాడు? పాతిక లచ్చలు ముష్టి..దానికొక బిల్డప్పూ! ఎవుడైనా హర్సించినాడా? "-- చివరికొచ్చిన చుట్టని, కప్పులో పడేసి, పైకి లేచాడు నాయుడు.


- ' నల్లి ' కుట్టు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్