test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమ్మకానికి ఏపీ పట్టణాలు

5 రోజుల క్రితం

cpm press
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 12:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


విజయవాడ : ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన జీవో 673 ఉపసంహరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్ తో కలిసి మాట్లాడారు.

బాబురావు మాట్లాడుతూ …. రాష్ట్రంలో కూటమి, ఎన్డీఏ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మున్సిపాలిటీలను ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 673 విడుదల చేయటం శోచనీయమన్నారు. వికసిత్ భారత్, ఏపీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినాశకర విధానాలు చేపట్టడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని 123 కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు, 21 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలలోని ఆస్తులను బడా కంపెనీలకు ధారాదత్తం చేయడానికి పూనుకోవటం గర్హనీయమన్నారు. మున్సిపల్ స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, కార్యాలయాలు, పార్కులు, ఆడిటోరియంలు, స్టేడియంలు… సర్వం.. కారు చౌకగా ప్రైవేటీకరణ ముసుగులో బడా సంస్థలకు దాఖలుపరిచే ప్రయత్నాలు ప్రమాదకరమని హెచ్చరించారు. 


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్