test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్రికెట్ దిగ్గజం కీలక స్పీచ్ .. ఇంతలో ఫోన్.. ఏం జరిగిందంటే ?

06 జూన్, 2026

Cricket legend delivering a crucial speech... suddenly, a phone call... here’s what happened.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 06, 2026, 12:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ముంబయి : ముంబయిలోని రోటరీ క్లబ్ వేదికగా జరిగిన ఒక హృదయపూర్వకమైన కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన పని ఇప్పుడు నెటిజన్ల మనసులను దోచేస్తోంది. దాదాపు 850 మంది చిన్నారుల ఉచిత గుండె శస్త్రచికిత్సల విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తుండగా, ఒక్కసారిగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

సమాజంలో నిరుపేద బాలల ప్రాణాలు కాపాడే ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ అనే కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతున్నారు. సభికులంతా ఆయన మాటలను ఎంతో నిశ్శబ్దంగా వింటున్నారు. సరిగ్గా అదే సమయంలో గవాస్కర్ మొబైల్ ఫోన్ మోగింది. సాధారణంగా ఎంతటి పెద్దవారైనా బహిరంగ సభల్లో ఉన్నప్పుడు ఫోన్ వస్తే కట్ చేయడం లేదా పక్కన పెట్టడం చేస్తుంటారు. కానీ, గవాస్కర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన ఫోన్ స్క్రీన్ వైపు చూసిన గవాస్కర్, ఏమాత్రం సంకోచించకుండా ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. సభలో ఉన్న వారందరికీ వినపడేలా మైకులోనే క్షమాపణలు చెబుతూ …. ‘‘ఈ ఫోన్ కచ్చితంగా మా ఆవిడ (మార్షనీల్) నుంచే వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి, ఈ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. బహుశా సభలో మరీ అంత ఎక్కువగా మాట్లాడకూడదని ఆమె నాకు గుర్తు చేస్తున్నట్లుంది’’ అంటూ తనదైన శైలిలో చమత్కరించారు. గవాస్కర్ నోటి నుంచి వచ్చిన ఈ మాటలకు హాల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. భార్య పట్ల ఆయనకున్న గౌరవానికి, ఆ సమయంలో ఆయన ప్రదర్శించిన సమయస్ఫూర్తికి సభికులంతా చప్పట్లతో అభినందనలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు గవాస్కర్ సరళతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ప్రపంచం మెచ్చిన గొప్ప క్రికెటర్ అయినా, కోట్లాది మంది అభిమానించే దిగ్గజమైనా.. ఇంట్లో భార్య మాటకు ఇచ్చే విలువ ముఖ్యం” అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మైదానంలోనే కాదు, నిజ జీవితంలోనూ గవాస్కర్ జెంటిల్‌మెన్ అనిపించుకున్నారని కొనియాడుతున్నారు.


https://youtube.com/shorts/LD0eW92ECDo?si=Z2HNy_ofi3h85Mn3


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్