test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇనుప సరీసృపం

2 గంటల క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 10:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నేనొక ఇనుప సరీసృపాన్ని
నిలువెత్తున ఉన్నా, ఇంకా శ్వాసిస్తూనే ఉన్నా
మీరు నన్ను తెల్ల ఏనుగువని ఆడిపోసుకున్నారు
అయినా భరించాను
నాకు బొట్టు బొట్టుగా విషం పెడుతూనే వచ్చారు
ఏళ్ల తరబడిగా భరించాను
మీ నిర్లక్ష్యాన్ని, మీ మౌనాన్ని..!

నా బిడ్డలు నాలో జవజీవాలు నింపుతూనే వచ్చారు
వాళ్ళ చేతులారా కృషి మూలంగానే
నే నెట్టుకొస్తున్నా

కానీ ఇవాళ ఆ విషం
చాలా వేగంగా, బహు లోతుగా ఎగిసిపడింది!

నాకు ఉపిరి సలపకుంది, ఇంకెంత మాత్రం అరాయించుకోలేక పోయాను
దావాగ్నిని ఉమిసాను,
నేను ప్రేమించిన బిడ్డలు దహించుకుపోయారు
ఎనిమిది మంది బిడ్డలు బూడిదై పోయారు
పట్నం యావత్తూ దుఃఖిస్తోంది!
నా గోడలన్నీ విషాదంలో మునిగిపోయాయి,
భరిస్తున్నాను

ఈ సరీసృపం దేనినీ క్షమించదు
నేను అగ్నిశిఖనై ప్రజ్వరిల్లే రోజు కోసం
వేచి ఉండండి!
- అనుపమ మల్లాజోస్యుల

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్