DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎర్రచందనం స్మగ్లరుకు జైలు, జరిమానా

16 జూన్, 2026

arest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 11:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) : శేషాచలం అడవుల నుండి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తికి ఆర్ఎస్ఎస్ ఎడిజె కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.ఆరు లక్షలు జరిమానాన్ని విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారని టాస్క్‌‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు. 2018లో శేషాచలం అటవీ పరిధి పెరుమాళ్ల పల్లి బీటు, టిఎన్ పాలెం సెక్షన్ తిరుపతి రేంజిలో తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా అనైకట్టు తాలూకా పెరియాపట్టి గ్రామానికి చెందిన ముత్తు ఏలుమలై ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ టాస్క్‌‌ఫోర్స్‌ అధికారులకు పట్టుబడ్డారన్నారు. పట్టుబడ్డ స్మగ్లర్ నేరం న్యాయస్థానంలో నిరూపితం కావడంతో న్యాయమూర్తి ‌శిక్ష విధించారని తెలిపారు. ముద్దాయిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించినట్లు అధికారులు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్