చందుర్తి : దేశ గురువనంటూ … గుర్రంపై సంచరించి అనుచరులతో కలిసి గ్రామస్తుల వద్ద నుండి డబ్బును కాజేస్తున్న దొంగబాబా, అతడి అనుచరులు పోలీసుల రంగప్రవేశంతో అక్కడి నుండి ఉడాయించిన ఘటన చందుర్తిలో జరిగింది. వేములవాడ మండలంలోని పలు గ్రామాల్లో ఓ గురువు తన అనుచరులతో సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో శనివారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తన అనుచరులతో కలిసి పరారయ్యాడు. చందుర్తి, వేములవాడ మండలాల్లోని పలు గ్రామాల్లో దేశ గురువు సంచరించాడు. వేములవాడ గ్రామీణ మండలం వెంకటంపల్లి, అచ్చన్నపల్లె గ్రామాల్లో పర్యటించిన అనంతరం.. చందుర్తి మండలం నర్సింగాపూర్‌కు చేరుకున్నాడు. గ్రామంలోని ఓ సంఘ భవనంలో ఆశ్రయం తీసుకున్నాడు. అనంతరం తన అనుచరులతో కలిసి గుర్రంతో రాత్రి వేళల్లో సంచరిస్తూ.. గ్రామస్థుల ఇళ్లకు వెళ్లేవాడు. స్వామికి నీళ్లు, కొబ్బరికాయలు తేవాలని ముందు తన అనుచరులతో సమాచారం పంపించాడు. గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఇళ్ల వద్దకు వెళ్లిన ఆ గురువు ప్రవర్తన చూసి గ్రామస్థులు కంగుతిన్నారు. మహిళలను చూసి అసభ్యకరంగా సైగలు చేసేవాడని వారు తెలిపారు. ఆయన వెంట వచ్చిన అనుచరులు మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి.. స్వామిజీ పూజలు చేసి పరిష్కరిస్తారంటూ.. మాయమాటలు చెప్పి గ్రామస్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారని చెప్పారు. శనివారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ దొంగబాబా తన అనుచరులతో కలిసి పరారయ్యాడు. ఈ సందర్భంగా జె.రమేష్, చందుర్తి ఎస్సై మాట్లాడుతూ …. ప్రజలు దొంగ బాబాలను, గురువులను నమ్మవద్దు అని చెప్పారు. అనుమానిత, కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం అందించాలని, అపరిచితుల మాయమాటల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
గుర్రంపై దొంగబాబ.. పోలీసుల ఎంట్రీతో పరార్ ..!
16 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 16, 2026, 11:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)