test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేనలో లుకలుకలు

07 జూన్, 2026

jsp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 01:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం


ప్రజాశక్తి-అమరావతి బ్యూరో​ : ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేనలో లుకలుకలు తారాస్థాయికి చేరాయి. జిల్లా నాయకత్వం మొదలు గ్రామ స్థాయి వరకు నేతలపై అధినాయకత్వానికి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కమిటీలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు జనసేన అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ‌‌వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త కమిటీని నియమించే వరకూ జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయమే పర్యవేక్షిస్తుందన్నారు. పార్టీ నాయకులలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యం వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో జిల్లా, నగర, మండల, గ్రామ కమిటీలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్నవారిని, కమిటీలలోని ఇతర సభ్యులను తప్పిస్తున్నట్లు చెప్పారు. ఇదివరకే ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని ఇదే విధంగా రద్దు చేశారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్