DRISHYAM
మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళల టి20 ప్రపంచకప్ లో మరో సంచలనం

16 జూన్, 2026

t20
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 11:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • న్యూజిలాండ్ పై శ్రీలంక గెలుపు

సౌథాంప్టన్: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రూప్-బిలో రెండుసార్లు టి20 ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైన ఆ జట్టు.. మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్ లో శ్రీలంక జట్టు చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. సౌథాంప్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలిగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగా.. అనంతరం శ్రీలంక జట్టు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి విజయం సాధించింది. లంక జట్టులో నిషిక శిల్వ(54నాటౌట్; 37బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్)కి తోడు కుషని(24నాటౌట్; 14బంతుల్లో 3ఫోర్లు) గెలుపులో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు లంక బౌలర్లు దిల్హారి(2/36) కి తోడు మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. కెప్టెన్ అమేలీ క్రెర్(45), సోఫీ డివైన్(45) మాత్రమే బ్యాటింగ్ లో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నిషిక శిల్వకు లభించగా.. ఈ ఓటమితో న్యూజిలాండ్ సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్