వాషింగ్టన్: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడంతో సిబ్బందితో సహా 15 మంది మరణించారు. ప్రమాదానికి ముందు విమానం ప్రధాన ఇంజిన్‌లో ఒకటి భారీ పేలుడుతో విడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం.. విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది క్షణాలకే ఇంజిన్ భాగం విడిపోయి అగ్నిగోళంగా మారింది. అనంతరం విమానం అదుపు కోల్పోయి నేలపై కూలిపోయింది. ప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. విమాన శిథిలాలు, ఇంజిన్ భాగాలు విమానాశ్రయం సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఘటనాస్థలంలోనే 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంజిన్ పేలుడుకు సాంకేతిక లోపమా? లేక మరేదైనా కారణమా? అనే దానిపై అమెరికా విమానయాన శాఖ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది.
అమెరికాలో కూలిన కార్గో విమానం
20 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 20, 2026, 08:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)