test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మీకు మెడిసిన్ కావాలా… ఈరోజే కొనుక్కోండి : వైద్య ఉద్యోగుల సంఘ నేత జీ.వీ.వీ.ప్రసాద్

19 మే, 2026

Do you need medicine? Buy it today: G.V.V. Prasad, Leader of the Medical Employees' Association.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 19, 2026, 04:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పు గోదావరి) : ఆన్ లైన్ మందుల అమ్మకాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా బుధవారం మెడికల్ షాపులు బంద్ ప్రకటించిన నేపథ్యంలో అవసరమైన అత్యవసర మందుల్ని ఈరోజే కొనుగోలు చేసుకోండని ఆంధ్రప్రదేశ్ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు జీ.వీ.వీ.ప్రసాద్ సూచించారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు …. బుధవారం జరిపే మందుల షాపుల బంద్ వల్ల ఎవ్వరూ ఇబ్బందులకు గురికాకుండా ముందస్తుగా అప్రమత్తం కావాలని ఆయన మంగళవారం పత్రికల ద్వారా సమాచారం అందించారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ ధ్రువీకరణ లేకుండానే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆన్ లైన్ లో భారీ డిస్కౌంట్ల అమ్మకాల వల్ల స్థానిక మందుల షాపులవారు తీవ్రంగా నష్టపోతున్నారనే ఆవేదనతో చేపడుతున్న బంద్ వల్ల ప్రజలెవ్వరూ ఇబ్బందికి గురికాకుండా ముందుగానే అవసరమైన మందుల్ని తెచ్చుకోవాలని ప్రసాద్ కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్