test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైట్‌హౌస్ వద్ద కాల్పులు – దుండగుడు మృతి

24 మే, 2026

Shots Fired at White House – Attacker Killed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 24, 2026, 05:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమెరికా : అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. యూఎస్ సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్‌పై ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో అతను మరణించాడు. ఈ ఘటనలో ఒక పౌరుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల ప్రకారం …. 17వ వీధి, పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద ఉన్న భద్రతా చెక్‌పాయింట్‌ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి తన బ్యాగ్‌లోంచి తుపాకీ తీసి అక్కడున్న సీక్రెట్ సర్వీస్ అధికారులపై కాల్పులు జరిపాడు. తక్షణమే అప్రమత్తమైన అధికారులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపి నిందితుడిని నిలువరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారని, ఆయన సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. ఈ కాల్పుల ఘటనలో గాయపడిన పౌరుడి పరిస్థితి విషమంగా ఉందని, అతనికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సహకారంతో దర్యాప్తు చేస్తున్నామని సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. కాల్పుల నేపథ్యంలో వైట్‌హౌస్‌ను తాత్కాలికంగా లాక్‌డౌన్ చేసి కొద్దిసేపటి తర్వాత ఎత్తివేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్