test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైట్ హౌస్ సమీపంలో కాల్పుల కలకలం

24 మే, 2026

white-house
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 24, 2026, 11:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వైట్ హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఒక అపరిచిత వ్యక్తి వైట్ హౌస్ పరిసరాల్లోని 17th స్ట్రీట్, పెన్సిల్వేనియా అవెన్యూ కూడలి వద్ద ఉన్న సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ దగ్గరకు చేరుకుని, ఒక్కసారిగా తన వద్ద ఉన్న ఆయుధాన్ని తీసి అక్కడి రక్షణ అధికారులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఊహించని దాడితో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ భద్రతా సిబ్బంది వెంటనే ఎదురుకాల్పులు జరపడంతో, సదరు దుండగుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఉన్నప్పటికీ, భద్రతా సిబ్బంది అప్రమత్తత కారణంగా ఆయనకు ఎలాంటి హానీ జరగలేదని, ఆయన పూర్తిగా సురక్షితంగా ఉన్నారని వైట్ హౌస్ అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్