అమరావతి : ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్ట్ తో ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయి. ఆటలాడుతూ ఒకరు, జిమ్ లో వర్కవుట్ చేస్తూ మరొకరు.. రన్నింగ్ చేస్తూ, మార్నింగ్‌వాక్ చేస్తూ … తింటూ కొందరు ఇలా గుండెపోటుతో చనిపోతున్నారు. ఈ మరణాల్లో ఎక్కువ ఉదయం వేళల్లో జరిగినవే అని డాక్టర్లు చెబుతున్నారు.
కార్డియాలజిస్టులు ఏం చెబుతున్నారంటే ?
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం …2022 లో 19.8 మిలియన్ల మంది గుండె సంబంధ వ్యాధులతో చనిపోయారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం మరణాలలో దాదాపు 32 శాతం. వీటిలో 85 శాతం మరణాలు గుండెపోటు, స్ట్రోక్ కారణంగా సంభవించాయి. గుండెకు రక్తం, ఆక్సిజన్‌ను పంపే ధమనిలో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది.
ఉదయమే ఎక్కువ ఎందుకంటే ?
ఉదయం వేళల్లో శరీరం సహజ ప్రతిస్పందనకు మేల్కోనే సమయంలో గుండెపై ఒత్తిడి పడుతుందంటున్నారు డాక్టర్లు. మనం ఉదయం మేల్కన్నప్పుడు శరీరం కార్టిసాల్‌లో పెరుగుదలను ప్రేరేపిస్తుంది..ప్లేట్‌లెట్లు అంటుకుంటాయి. రక్తపోటు పెరుగుతుంది. నిద్ర లేచిన 0-నుంచి 100 సెకన్లలో కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా ఉదయం 7 గంటలనుంచి 11 గంటల మధ్య కాలంలో ఇది ఎక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల మధ్య లో కూడా గుండెపోటు ప్రమాదం ఉందని అంటున్నారు. చాలా గుండెపోటులు కార్టిసాల్ పెరుగుదల, ప్లేట్‌లెట్ అంటు పెరగడం, రక్తపోటు పెరుగుదల గుండెపోటు, ఆకస్మిక గుండె మరణాల ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు.


డాక్టర్ల హెచ్చరిక…
గుండెను రక్షించడంలో, హృదయ సంబంధ సంఘటనల ప్రమాదాలను తగ్గించడంలో మనకు సహాయపడే సున్నితమైన ఉదయం దినచర్యను అవలంభించాలని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మేల్కొన్న వెంటనే చేయవలసిన, చేయకూడని కొన్ని విషయాలను సూచించారు.
డాక్టర్ల సూచనలు …
ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం, హైడ్రేషన్ చేయకపోవడం, లేచిన వెంటనే మందులు వేసుకోవద్దు. వెంటనే పనిలోకి దిగడం మానేయాలి. మన గుండెకు అత్యంత రక్షణ అవసరమైన సమయం అదే అని అంటున్నారు డాక్టర్లు.
లేచిన వెంటనే ముందుగా నీళ్లు తాగాలి. ఆ తర్వాత మీ మందులను సమయానికి తీసుకోవాలి. ప్రోటీన్-ఫార్వర్డ్ అల్పాహారం తినాలి. లేవగానే 10-15 నిమిషాలు తేలికపాటి కదలికను మీ శరీరానికి ఇవ్వాలి. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయంటున్నారు డాక్టర్లు.

గుండెపోటు ముఖ్య లక్షణాలు :ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం. శ్వాస ఆడకపోవడం.
అలసట. వికారం లేదా వాంతులు. భుజం, మెడ, వీపు, దవడ లేదా చేతుల్లో నొప్పి.
విపరీతమైన చెమటలు పట్టడం.

గుండెపోటుకు దారితీసే అంశాలు : అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ మధుమేహం
శారీరక శ్రమ లేకపోవడం మానసిక ఒత్తిడి ధూమపానం వంశపారంపర్యంగా వచ్చే జన్యు కారకాలు
ముఖ్య గమనిక :
గుండెపోటు లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. పై లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి








కామెంట్‌లు (0)